సుకుమార్ పుట్టిన గడ్డపై `పుష్ప-2`!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప-2` ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అవుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 26 Sep 2024 10:30 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న `పుష్ప-2` ఎలాంటి అంచనాల మధ్య రిలీజ్ అవుతుందన్నది చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం భారీ విజయం సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. మరోసారి పాన్ ఇండియాని `పుష్ప-2` వసూళ్లతో షేక్ చయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ శిల్పంలా చెక్కుతున్నాడు.
ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో చాలా భాగం చిత్రీకరించారు. అవసరం మేర ఫారెస్ట్ లొకేషన్లను లోనూ పలు షెడ్యూల్స్ నిర్వహించారు. ప్రస్తుంతం ఆర్ ఎఫ్ సీలోనే మరో షెడ్యూల్ జరుగుతోంది. అక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా కాకినాడలో కూడా రెండు , మూడు రోజుల పాటు కొన్నికీలక సన్నివేశాలుప్లాన్ చేసినట్లు సమాచారం. ఆర్ ఎఫ్ సీ సన్నివేశాలకు..కాకినాడ ఎపిసోడ్ కి ఇంటర్ లింక్ ఉండటంతో రాజమౌళి ఇలా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఓ టీం ఆర్ ఎఫ్ సీలో బిజీగా ఉంటే మరో టీమ్ సుకుమార్ సహా అంతా కాకినాడ షూట్ లో బిజీగా ఉంటారని సమాచారం. కాకినాడ షూట్ లో బన్నీ పాల్గొంటాడు. దీంతో మేజర్ టాకీ పూర్తయినట్లేనని యూనిట్ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం. అనంతరం బ్యాలెన్స్ పాటల షూటింగ్ మొదలవుతుందని సమాచారం. సినిమాలో జాతర పాట సహా మరో మొత్తం నాలుగు పాటలున్నట్లు సమాచారం.
అలాగే ఐటం నెంబర్ లో ఎవరు నటిస్తున్నారు? అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈనెలఖరుకు నర్తకి ఎవరో క్లారిటీ వస్తుందని సమాచారం. పాటల షూటింగ్ సహా పెండింగ్ టాకీ మొత్తం అక్టోబర్ నెలకల్లా పూర్తవుతుందని సమాచారం. సుకుమార్ స్వస్థలం కాకినాడ అన్నసంగతి తెలిసిందే. ఆ కారణంగానూ సుకుమార్ అక్కడ మూడు రోజుల షూట్ ప్లాన్ చేసి ఉండొచ్చు? అని కొంతమది భావిస్తున్నారు.