కేరళలో 'పుష్ప 2' ఫీవర్.. అల్లు అర్జున్ సరికొత్త అరాచకం
కేవలం మహిళా అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొట్టరక్కారలోని మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు లేడీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయడం జరిగింది.
By: Tupaki Desk | 7 Nov 2024 12:15 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ కోసం కేరళలో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ మరో స్థాయికి చేరుతోంది. కేరళలో ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్న ప్రమోషన్లు, ప్రదర్శనలు చూసి ఫ్యాన్స్ పులకరించిపోతున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్స్ ను దాటి మరీ ఈ చిత్రానికి గ్రాండ్ రిలీజ్ జరగాలని ఆరాటపడుతున్నారు.
డిస్ట్రిబ్యూటర్లు సినిమాను ఆ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో ‘పుష్ప 2’ కోసం 55 ఫ్యాన్ షోలకి సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షోలకి తెల్లవారుఝామున 4 గంటల నుంచి మొదలై ఉదయం 7 గంటల వరకు ప్రదర్శనలు కొనసాగుతాయి. టికెట్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి, ఫ్యాన్స్ లో భారీ ఎత్తున ఉత్సాహం కనిపిస్తోంది.
అదీ కాకుండా, కేవలం మహిళా అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొట్టరక్కారలోని మినర్వా ఎంపైర్ థియేటర్లో ఉదయం 7 గంటలకు లేడీ ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షోలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా షోలను డిమాండ్ ఆధారంగా మరికొన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
కేరళ డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 1 కలెక్షన్స్‌ను మొదటి రోజే అధిగమిస్తామన్న ధీమాతో ఉన్నారు. ఈ రేంజ్‌లో షోలకి సన్నాహాలు చేస్తే ఆల్ టైం రికార్డు కలెక్షన్లు సాధ్యమేనని అక్కడి వర్గాలు అంచనా వేస్తున్నాయి. విడుదల తేదీ దగ్గరపడే కొద్దీ పుష్ప 2 పై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ చిత్రానికి భారీగా మద్దతు లభించే అవకాశం ఉంది.
టికెట్స్ కోసం ఫ్యాన్స్ పోటీ పడుతుండగా, విడుదలకు ముందే భారీ హైప్ నెలకొంది. అల్లు అర్జున్ పుష్ప 2 ద్వారా కల్కి 2898 ఏడి, దేవర వంటి సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా సరికొత్త రికార్డులు సృష్టించాలని ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ మరియు అజనీష్ లోకనాథ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మార్పు కూడా చర్చనీయాంశమైంది. మరో నెల రోజుల్లో పుష్ప 2 ప్రభావం మరింతగా పెరగడం ఖాయం.