Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఓటీటీ అధికారిక ప్రకటన

అతి త్వరలోనే మీ ముందుకు సూపర్‌ హిట్‌, బ్లాక్ బస్టర్ పుష్ప 2 సినిమా రాబోతుందని నెట్‌ఫ్లిక్స్ సోషల్‌ మీడియా ద్వారా అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ చేయడంతో స్ట్రీమింగ్ తేదీపై అందరి దృష్టి ఉంది.

By:  Tupaki Desk   |   19 Dec 2024 9:31 AM GMT
పుష్ప 2 ఓటీటీ అధికారిక ప్రకటన
X

రికార్డ్‌ బ్రేకింగ్‌ కలెక్షన్స్‌తో దూసుకు పోతున్న పుష్ప 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్‌ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో స్ట్రీమింగ్‌ చేయబోతుంది. ఆ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. అతి త్వరలోనే మీ ముందుకు సూపర్‌ హిట్‌, బ్లాక్ బస్టర్ పుష్ప 2 సినిమా రాబోతుందని నెట్‌ఫ్లిక్స్ సోషల్‌ మీడియా ద్వారా అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ చేయడంతో స్ట్రీమింగ్ తేదీపై అందరి దృష్టి ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ తేదీని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు దాదాపు అన్నీ థియేటర్‌ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కానీ ఈ సినిమా ఒక వారం లేదా రెండు వారాలు ఆలస్యంగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయిదు వారాల తర్వాత అంటే ఈ సినిమాను జనవరి 9న విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పటికీ థియేట్రికల్‌ రన్‌ కొనసాగితే మరికొన్ని రోజులు వెయిట్‌ చేసి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఓటీటీ ద్వారా పుష్ప 2 ని చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియా మొత్తం పుష్ప 2 హవా కొనసాగుతోంది. రూ.1500 కోట్ల వసూళ్ల దిశగా సినిమా దూసుకు పోతుంది. మూడో వీకెండ్‌లో సినిమా రాబట్టే వసూళ్లపై అందరి దృష్టి ఉంది. రికార్డ్‌ స్థాయిలో నార్త్‌ ఇండియా నుంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ, ముఖ్యంగా ఏ హిందీ స్టార్‌ హీరో మూవీ సాధించని వసూళ్లను ఈ సినిమా సాధిస్తూ దూసుకు పోతుంది. దాదాపు రూ.700 కోట్లకు ఈ సినిమా చేరువలో ఉంది. వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.1450 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.

అతి త్వరలోనే టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 2' సినిమా రికార్డ్‌లను బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. బాహుబలి సినిమా లాంగ్‌ రన్‌లో రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. ఆ మొత్తం సాధించాలి అంటే మరో రూ.300 కోట్ల వసూళ్లను పుష్ప 2 రాబట్టాల్సి ఉంది. ఆ స్థాయి వసూళ్లకు ఈ సినిమా ఎంత వరకు చేరుకుంటుంది అనేది చూడాలి. దంగల్ వసూళ్లను చేరుకోడం సాధ్యం కాకపోవచ్చు, కానీ బాహుబలి 2 రికార్డ్‌ను బ్రేక్‌ చేయడం పెద్ద కష్టం కాదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.