Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు పుష్ప రాజ్‌ విజయోత్సవ జాతర..!

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలో వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్‌ సినిమాల జాబితాలోకి చేరిపోయింది.

By:  Tupaki Desk   |   12 Dec 2024 6:03 AM GMT
ఎట్టకేలకు పుష్ప రాజ్‌ విజయోత్సవ జాతర..!
X

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. తక్కువ సమయంలో వెయ్యి కోట్లు అంతకు మించి వసూళ్లు రాబట్టిన నేపథ్యంలో ఇండియాస్ బిగ్గెస్ట్‌ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. లాంగ్‌ రన్‌లో ఈ సినిమా సాధించబోతున్న వసూళ్ల గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా సందడి కొనసాగాలి అంటే కచ్చితంగా మరిన్ని రోజులు ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకోవాలి. అందుకే మేకర్స్ నార్త్‌ ఇండియాతో పాటు సౌత్‌ ఇండియాలోనే సక్సెస్‌ వేడుకలు జరుపుకోవాలని భావిస్తున్నారు అంటూ మైత్రి మూవీ మేకర్స్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమా విడుదలన సమయంలో సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన కారణంగా జనాల్లోకి వెళ్లాలి అంటే పుష్ప మేకర్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సక్సెస్ వేడుకలు జరుపుకుంటే ఎక్కడ విమర్శలు వస్తాయో అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు పుష్పరాజ్‌ బయటకు రాబోతున్నారు. ఢిల్లీలో ఈనెల 15వ తారీఖున పెద్ద ఎత్తున మీడియా సమావేశం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జాతీయ మీడియా వర్గాల వారు సైతం ఆ మీడియా మీట్‌కి హాజరు కాబోతున్నారు. రికార్డ్‌ స్థాయి వసూళ్లను అందిస్తున్న నార్త్‌ ఇండియన్‌ ప్రేక్షకులకు థాంక్స్‌ చెప్పడం కోసం మీడియా మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు.

ఢిల్లీలో పెద్ద ప్రెస్‌ మీట్‌ తర్వాత కర్ణాటకలో భారీ సక్సెస్‌ ఈవెంట్‌ ఉంటుందట. ఫ్యాన్స్‌తో పాటు కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రత్యేక అతిథి ఆధ్వర్యంలో పుష్ప 2 సినిమా విజయోత్సవ వేడుక జరుపుతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌ సమయంలో బెంగళూరును స్కిప్‌ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు సక్సెస్‌ వేడుక అక్కడ ప్లాన్‌ చేస్తున్నారట. కర్ణాటకలో భారీ ఎత్తున పుష్ప 2 సినిమాకు వసూళ్లు నమోదు అవుతున్నాయి. కనుక ఫ్యాన్స్‌ను కలుసుకునేందుకు అల్లు అర్జున్‌, రష్మికలు ఆ ఈవెంట్‌కి హాజరు కాబోతున్నారు.

కన్నడ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన శ్రీలీల సైతం ఆ సక్సెస్‌ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అల్లు అర్జున్‌ సినిమా హిట్‌ తర్వాత సైలెంట్‌ కాకుండా వరుసగా ఈవెంట్స్‌కి హాజరు అయ్యేందుకు రెడీగా ఉన్నారు. దీంతో సినిమాకు మరింతగా వసూళ్లు నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయంను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు, బాక్సాఫీస్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ నటనకు జాతీయ అవార్డు దక్కడం ఖాయం అంటూ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు. రష్మిక నటన సైతం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది.