Begin typing your search above and press return to search.

పుష్ప 2 కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్..!

పుష్ప 2 రెండో రోజు కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సినిమా రెండు రోజుల్లో 449 కోట్లు రాబట్టింది

By:  Tupaki Desk   |   7 Dec 2024 1:02 PM GMT
పుష్ప 2 కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్..!
X

అల్లు అర్జున్ సుకుమార్ ఈ కాంబో సినిమా వస్తే బాక్సాఫీస్ రచ్చ ఎలా ఉంటుందో అందుకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 కలెక్షన్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందు విపరీతమైన బజ్ చూసి సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే కలెక్షన్స్ కూడా దుమ్ము దులిపేస్తాయని అనుకున్నాం అందుకు తగినట్టుగానే పుష్ప 2 వసూళ్లు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ కలెక్షన్స్ రాబడుతుంది. ఫస్ట్ డే రోజే 294 కోట్లతో బ్లాస్ట్ చేయగా అదే దూకుడు రెండో రోజు కొనసాగించింది.

పుష్ప 2 రెండో రోజు కలెక్షన్స్ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సినిమా రెండు రోజుల్లో 449 కోట్లు రాబట్టింది. భారతీయ సినీ చరిత్రలో కనివినీ ఎరుగని విధంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది పుష్ప 2. తెలుగు రెండు రాష్ట్రాలే కాదు పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సంచలనాలు సృష్టిస్తున్న రికార్డులు అదిరిపోతున్నాయి. సినిమా ఆడియన్స్ కు ఏ రేంజ్ లో ఎక్కేసిందో వస్తున్న వసూళ్లను చూస్తే అర్ధమవుతుంది.

నార్త్ లో కూడా ఈ సినిమాకు ప్రేక్షక నీరాజనాలు అందుతున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ చేసిన అల్లు అర్జున్ ఇది సార్ నా బ్రాండ్ అంటూ బాక్సాఫీస్ పై తన పంజా విసురుతున్నాడు. సుకుమార్ టేకింగ్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, రష్మిక అందాలు సినిమాకు అదనపు ఆకర్షణగా మారాయి.

రెండు రోజుల్లోనే 450 కోట్లు అంటే ఆదివారం వీకెండ్ అదే రేంజ్ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఫుల్ రన్ లో సినిమా 1000 నుంచి 1500 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తానికి పుష్ప 2 సినిమా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుందని ఈ కలెక్షన్స్ దూకుడు చూస్తే అర్ధమవుతుంది. అల్లు అర్జున్ పుష్ప 2 వైల్డ్ ఫైర్ బాక్సాఫీస్ లెక్కలు ఇన్నేళ్ల భారతీయ సినీ చరిత్రలో ఉన్న రికార్డులన్నీ బద్ధలు కొట్టేస్తున్నాయి. కలెక్షన్స్ మాత్రమేనా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసి పుష్ప 2 నుంచి కూడా అల్లు అర్జున్ కి మరోసారి నేషనల్ అవార్డ్ పక్కా అనిపించేలా ఉంది. ఫ్యాన్స్ మాత్రమే కాదు పుష్ప 2 చూసిన సినీ లవర్స్ కూడా అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిపోతున్నారు. నటుడిగా అల్లు అర్జున్ ని మరో 10 మెట్లు ఎక్కించేసింది ఈ సినిమా.