పుష్ప 2 - బిగ్గెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాసివ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ తో వచ్చిన ‘పుష్ప 2’ సృష్టించిన ప్రభంజనం మేకర్స్ కష్టాన్ని పూర్తిగా మరిచిపోయేలా చేసిందని చెప్పాలి
By: Tupaki Desk | 24 Dec 2024 6:09 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాసివ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ తో వచ్చిన ‘పుష్ప 2’ సృష్టించిన ప్రభంజనం మేకర్స్ కష్టాన్ని పూర్తిగా మరిచిపోయేలా చేసిందని చెప్పాలి. మూడేళ్ళ పాటు వారు పడిన శ్రమకి ఇప్పుడు ప్రేక్షకుల ప్రశంసలు, అంతకుమించి సినిమాలు వస్తోన్న లాభాల రూపంలో రిజల్ట్ కనిపిస్తోంది. దీనికి పూర్తిస్థాయిలో ‘పుష్ప 2’ మేకర్స్ అర్హులు అనే మాట వినిపిస్తోంది.
రాత్రీపగలు లేకుండా ఈ సినిమా కోసం టీమ్ మొత్తం ఎంత కష్టపడ్డారో సుకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే నిర్మాతలు కూడా సుకుమార్ మీద నమ్మకంతో సినిమాకి అడిగినంత పెట్టుబడి పెట్టారు. అలాగే ఈ సినిమా ప్రోడక్ట్ మీద నమ్మకంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ రేట్లకి రైట్స్ ని అమ్మారు. అయితే ఈ సినిమాపై జరిగిన బిజినెస్ చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.
అన్ని భాషలలో కలిపి ప్రీరిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటడం అంటే చిన్న విషయం కాదు. అందులో థీయాట్రికల్ వ్యాపారమే 617 కోట్లు జరిగింది. ఇండియాలోనే అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా ఈ మూవీ రికార్డులు సృష్టించింది. అయితే ఈ కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ మూవీ అందుకుంటుందా అనే సందేహాలు చాలా మందకి వచ్చాయి. ఆ సందేహాలని పటాపంచలు చేస్తూ ఈ చిత్రం కలెక్షన్స్ ప్రభంజనం సృష్టించింది.
రిలీజ్ అయిన అన్ని భాషలలో, అన్ని ఏరియాలలో సాలిడ్ వసూళ్లు సాధించింది. ముఖ్యంగా హిందీలో అయితే అంచనాలకి మించి ఈ సినిమా కలెక్షన్స్ అందుకోవడం విశేషం. 19 రోజుల్లో ఈ సినిమా 742 కోట్ల షేర్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుంది. ఇందులో మెజారిటీ పార్ట్ హిందీ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఈ కలెక్షన్స్ ద్వారా ఇప్పటి వరకు మూవీ 125 కోట్ల ప్రాఫిట్ ని అందుకుంది. ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాల జాబితాలో ఒకటిగా పుష్ప 2 నిలిచింది.
ఈ మూవీకి వచ్చిన ప్రాఫిట్ ‘స్త్రీ2’, ‘హనుమాన్’ లతో పోల్చి చూస్తే తక్కువగానే ఉండొచ్చు కానీ, అత్యధిక ప్రీరిలీజ్ జరిగిన తర్వాత కూడా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించి ఎక్స్ ట్రాగా 100 కోట్లకి పైగా ప్రాఫిట్ అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఈ లాభం లాంగ్ రన్ లో 130 కోట్లు దాటొచ్చని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. ఇండియాలో అత్యధిక బిజినెస్ చేసి అత్యధిక ప్రాఫిట్ సాధించిన సినిమాల జాబితాలో ‘పుష్ప 2’ టాప్ లో నిలుస్తుందని చెప్పొచ్చు.