పుష్ప 2 బాక్సాఫీస్ పంజా.. ఇది మామూలు రచ్చ కాదు..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది.
By: Tupaki Desk | 9 Dec 2024 5:05 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఊహించని నెంబర్లతో బాలీవుడ్ కు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మరో సారి అర్ధమవుతుంది. విడుదలైన అన్ని భాషల్లో సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంటున్న పుష్ప 2 వీకెండ్ ను చక్కగా యూజ్ చేసుకుంది.
ఇక రోజురోజుకు కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ హీరో అందుకొని రికార్డులను ఈ సినిమా అందుకుంటోంది. ఇక మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 621 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి, భారీ రికార్డులను బద్దలుకొట్టింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత వేగంగా 600 కోట్ల మార్క్ దాటిన చిత్రంగా నిలిచింది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి రోజు 294 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో ప్రారంభమైంది. ఇక రెండవ రోజు లెక్క కూడా అస్సలు తగ్గలేదు. 500 కోట్ల మార్క్ అందుకునేందుకు పుష్ప 2 జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది. ఇక మూడు రోజుల్లోనే 621 కోట్ల గ్రాస్‌ను దాటడం విశేషం. ఈ సినిమా రాబోయే పాన్ ఇండియా సినిమాలకు మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో ఒదిగిపోయిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వలయంలా విజృంభిస్తోంది. తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ బెల్ట్‌లో కూడా సినిమా అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. హిందీ బెల్ట్‌లో మొదటి రోజే భారీ ఓపెనింగ్ సాధించిన పుష్ప 2, మూడు రోజుల్లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా వైల్డ్‌ఫైర్ బ్లాక్‌బస్టర్ అనేది ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. తెలుగు సినిమాకు ఇది మరోసారి గొప్ప గౌరవం తీసుకువచ్చింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో గొప్ప విజయాన్ని సాధించింది. మొత్తం మీద, పుష్ప 2: ది రూల్ సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా సత్తాను మరోసారి చాటింది.
తప్పకుండా ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటుందని మొదటి నుంచి సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. ఆ విధంగా బజ్ క్రియేట్ అయ్యేలా సాలీడ్ ప్రమోషన్స్ కీడా చేశారు. అల్లు అర్జున్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తనవైపు తిప్పుకునేలా చేశాడు. తమిళ్ లో కూడా కలెక్షన్లు గట్టిగానే ఉన్నాయి. ఇక హిందీ మలయాళం కూడా లెక్క గట్టిగానే పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఇంకెంత ఎత్తుకు వెళుతుందో చూడాలి.