Begin typing your search above and press return to search.

పుష్ప 2 : గంటకు లక్ష దాటిన రూలింగ్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల పుష్ప 2 నిన్న బాక్సాఫీస్‌ వద్ద రూలింగ్ మొదలు పెట్టింది.

By:  Tupaki Desk   |   6 Dec 2024 8:31 AM GMT
పుష్ప 2 : గంటకు లక్ష దాటిన రూలింగ్‌
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల పుష్ప 2 నిన్న బాక్సాఫీస్‌ వద్ద రూలింగ్ మొదలు పెట్టింది. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా సినిమాకు రూ.130 కోట్ల వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. చాలా మంది సినిమాకు వెళ్లాలి అనే ఆసక్తి ఉన్నప్పటికీ టాక్‌ వచ్చిన తర్వాత టికెట్ బుక్‌ చేసుకుందాం అంటూ ఎదురు చూసినట్లు ఉన్నారు. అందుకే పుష్ప 2 సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే సినిమాకు హిట్ టాక్ రావడంతో బుక్‌ మై షో లో టికెట్ల బుకింగ్‌ రికార్డులు బద్దలు అయ్యాయి. గంటలకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం అనేది మరే సినిమాకు దక్కని అరుదైన రికార్డ్‌గా చెప్పుకోవచ్చు.

బుక్‌మై షోలో ఒక సినిమాకు చివరి గంటలో జరిగిన బుకింగ్‌, చివరి 24 గంటల్లో జరిగిన బుకింగ్‌ అంటూ లెక్కలు, ట్రెండ్ చూపిస్తూ ఉంటారు. పుష్ప 2 సినిమా విడుదల అయిన తర్వాత అంటే 5వ తారీకు ఉదయం 11 గంటల తర్వాత బుకింగ్‌ సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒకనొక సమయంలో గంటలకు 97 వేల టికెట్లు బుక్ అయ్యాయి అంటూ బుక్‌ మై షో చూపించింది. అదే రికార్డ్‌ అనుకుంటే ఆ తర్వాత కొన్ని గంటలకు ఏకంగా లక్షకు పైగా గంటలో టికెట్లు బుక్ అయ్యాయి అంటూ ట్రెండ్‌ చూపించడం జరిగింది. గతంలో ఎప్పుడూ ఈ సినిమాకు లక్ష మార్క్‌ ను బుక్‌ మై షో లో టచ్ చేయలేదు.

పుష్ప 2 సినిమాను శని, ఆదివారాల్లో చూడ్డం కోసం ప్రేక్షకులు దేశ వ్యాప్తంగా ఉన్న థియేటర్లలో మల్టీ ప్లెక్స్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడం జరిగింది. ఈ స్థాయిలో టికెట్లు బుక్ కావడంతో బాలీవుడ్‌ స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు. ఒక సౌత్‌ హీరో సినిమాకు, అదీ ఒక ప్రాంతీయ భాష సినిమా హీరోకు ఇంత క్రేజ్ ఏంటి, ఆయన చేసిన పుష్ప 2 కి ఇంత బజ్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకునేందుకు చాలా మంది బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటూనే ఉన్నారు.

ఇప్పటికి కూడా సినిమాకి అత్యధికంగా టికెట్లు బుక్ అవుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టికెట్లు అత్యధికంగా బుక్ అవుతున్నాయి. నార్త్‌ ఇండియాలోనూ ప్రతి రాష్ట్రంలో భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతోంది. ఈ స్థాయిలో బుకింగ్‌ జరగడం ఇండియన్‌ సినీ చరిత్రలో నిలిచి పోయే ఘట్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ముందు రాబోతున్న సినిమాలు ఏవీ గంటకు లక్ష టికెట్ల చొప్పున బుక్‌ కావడం అనేది అసాధ్యం అంటూ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.