అన్నిచోట్ల నెం.1... 'పుష్ప 2'కి 120 మిలియన్లు!
ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెం.1 లో ట్రెండ్ అవుతోంది.
By: Tupaki Desk | 19 Nov 2024 6:45 AM GMTఅల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. ప్యాచ్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ దక్కింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో నెం.1 లో ట్రెండ్ అవుతోంది. కొన్ని గంటల్లోనే పదుల కొద్ది మిలియన్ వ్యూస్‌ను రాబట్టిన పుష్ప 2 ట్రైలర్‌కి ఇప్పటి వరకు ఏకంగా 120 మిలియన్ల వ్యూస్ నమోదు అయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌గా మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా వైరల్ అవుతున్న ఈ ట్రైలర్ ముందు ముందు మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
పుష్ప 2 ట్రైలర్ ఓవరాల్‌గా 120 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకోగా, రికార్డ్ స్థాయిలో 2.3 మిలియన్ల లైక్స్ నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో లైక్స్ రావడం చాలా అరుదుగా జరుగుతుంది. వ్యూస్‌తో పాటు లైక్స్ సైతం రికార్డ్ నమోదు చేయడంతో సినిమాపై ఉన్న అంచనాలు ఏంటో అర్థం అవుతోంది. సినిమాకు ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. సినిమా ఇతర రైట్స్ ద్వారా మరో పాతిక కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారీ సినిమాకు ట్రైలర్‌తో మరింతగా అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌లోని ప్రతి షాట్ ఆహా అన్నట్లుగా ఉందని నెటిజన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల బీహార్‌లో జరిగిన భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. బాలీవుడ్ హీరోలకు సైతం ఎప్పుడూ దక్కని ఈ భారీ వెల్కమ్ కు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. బీహార్‌లో అల్లు అర్జున్‌కి ఈ స్థాయిలో అభిమానులు ఉన్నారా అంటూ అవాక్కవుతున్నారు. బీహార్‌లో ఏ స్థాయిలో సినిమా వసూళ్లు చేస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్ ఇండియాలో వెయ్యి కోట్ల టార్గెట్‌తో ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేయడం పుష్ప 2 కి సాధ్యం అంటూ చాలా నమ్మకంగా అంతా కనిపిస్తున్నారు.
పుష్ప 2 సినిమా బాహుబలి 2 వసూళ్లను బ్రేక్ చేస్తుందని, దాంతో పాటు చైనాలో వెయ్యి కోట్లకు మించి వసూళ్లు సాధించి, ఓవరాల్‌గా రూ.2000 కోట్లకు మించి వసూళ్లు చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది. చైనాలోనూ భారీ స్క్రీన్స్‌లో విడుదల కానుందట. 11,500 స్క్రీన్స్ లో విడుదల కాబోతున్న పుష్ప 2 కచ్చితంగా సరికొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయం. ఇప్పుడు ఎలా అయితే ట్రైలర్ కి వ్యూస్ రికార్డులను సృష్టిస్తుందో అలాగే వసూళ్లు సైతం భారీ ఎత్తున నమోదు కావడం ఖాయం, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చూడని నెంబర్‌ను నమోదు చేయడం ఖాయం అనే అభిప్రాయంను అల్లు అర్జున్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.