Begin typing your search above and press return to search.

పుష్ప-2.. మరో వీకెండ్ పై బండెడు ఆశలు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   13 Dec 2024 3:15 AM GMT
పుష్ప-2.. మరో వీకెండ్ పై బండెడు ఆశలు..!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప-2 మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అయిన ఆ సినిమా.. ఫస్ట్ షో నుంచి కూడా వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల మార్క్ ను టచ్ చేసి సత్తా చాటింది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన సినిమాగా నిలిచింది. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత అంతటి వసూళ్లు రాబట్టిన తెలుగు మూవీగా ఘనత సాధించింది. భవిష్యత్తులో మరిన్ని వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది.

అయితే పుష్ప-2 విజయం పట్ల మూవీ టీమ్, అభిమానులే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. చెప్పాలంటే.. అంతా పెద్ద పండుగలా జరుపుకుంటున్నారు. ఫస్ట్ వీకెండ్ లో పుష్ప సీక్వెల్ భారీ వసూళ్లను రాబట్టగా.. ఇప్పుడు రెండో వీకెండ్ పై బండెడు ఆశలు పెట్టుకుంటున్నారు.

ముఖ్యంగా చాలా రోజులుగా పుష్ప-2 లాంటి హిట్ కోసం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు ఎంతో వెయిట్ చేస్తున్నారు. కొన్ని మూవీస్ ఫ్లాప్ అవ్వడం వల్ల డబ్బులు కోల్పోయి, స్టాఫ్ కు సరైన టైమ్ లో జీతాలు ఇవ్వలేక, కరెంట్ బిల్లులు కట్టలేక, థియేటర్లను సరిగ్గా నడపలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇప్పుడు పుష్ప-2 హిట్ అవ్వడంతో అనేక సమస్యలు తీరాయనే చెప్పాలి. అదే సమయంలో సెకెండ్ వీకెండ్ లో థియేటర్లకు భారీగా ప్రేక్షకులు వస్తారని ఆశిస్తున్నారు. మంచి వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ లాగే ఆడియన్స్ ఓ రేంజ్ లో రావాలని కోరుకుంటున్నారు. మరిన్ని లాభాలు అందుకుని.. తమ నష్టాలను పూడ్చుకోవాలని చూస్తున్నారు.

అయితే వీక్ డేస్ లో పుష్ప-2 వసూళ్లు కాస్త తగ్గినట్టు వార్తలు వస్తున్నా.. మిగతా పెద్ద చిత్రాల కన్నా ఎక్కువగా వసూలు చేసిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇక మేకర్స్ రీసెంట్ గా పోస్ట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయ్యేలా చేయడమే తమ టార్గెట్ గా పెట్టుకున్నారు.

ఇప్పటికే ఢిల్లీలో ఈవెంట్ జరగ్గా.. మరిన్ని నగరాలను విజిట్ చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో టికెట్ రేట్లు తగ్గుతున్నాయి. దీంతో మరింత మంది పుష్ప-2 చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లడం గ్యారంటీ. మరి సెకెండ్ వీకెండ్ లో ఎలాంటి వసూళ్లు వస్తాయో వేచి చూడాలి.