'పుష్ప-2' వార్ లో నెగ్గేదెవరు? తగ్గేదెవరు?
సినిమా అంతా పబ్లిక్ టాక్ రూపంలో బయటకు వచ్చేస్తే ఎలాంటి పరిస్థితులుంటాయో తెలిసిందే.
By: Tupaki Desk | 30 Nov 2024 12:30 PM GMTరిలీజ్ కి ముందే ప్రీమియర్ షోలు వేయడం అంటే? ఒకే కత్తికి రెండు వైపులా పదును ఉన్న లెక్క మాదిరే. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే? అలాంటి కంటెంట్ ని ఎంత ఆపుదాం అన్నా ఆగదు. బాక్సాఫీస్ వసూళ్లతో షేక్ అవుతుంది. అదే ప్లాప్ టాక్ తెచ్చుకున్నా.. యావరేజ్ టాక్ తెచ్చుకున్నా పరిస్థితులు అంతే దారుణంగా ఉంటాయి. సినిమా అంతా పబ్లిక్ టాక్ రూపంలో బయటకు వచ్చేస్తే ఎలాంటి పరిస్థితులుంటాయో తెలిసిందే.
అందుకే తమిళ నాడులో థియేటర్ వద్ద రివ్యూలు బ్యాన్ చేసారు. అంటే ఈ కోణంలో చూస్తే? ప్రీమియర్ ఆటలకు రిస్క్ శాతం ఎక్కువ అన్నది కనిపిస్తుంది. పాన్ ఇండియా సినిమా 'బాహుబలి' తర్వాత 'పుష్ప-2' రిలీజ్ కి ముందే డిసెంబర్ 4న మిడ్ నైట్ షోలు షురూ అయిన సంగతి తెలిసిందే. టికెట్ ధర 1000 లకు పైగా ఉంది. ఇంతవరకూ ఈ రేట్ పెట్టి టికెట్ అమ్మింది లేదు. కల్కి 2898 టికెల్ ధర ఏపీ డిప్యూటీ సీఎం 1000 రూలకు అమ్ముకోమన్నా? నిర్మాత ఆ సాహసం చేయలేదు.
కానీ 'పుష్ప -2' ఏమాత్రం లెక్క పెరగాలే తప్ప! తగ్గకూడదు అన్నట్లే కనిపిస్తుంది. కంటెంట్ పై ఎంతో కాన్పిడెంట్ గా సుకుమార్ అండ్ కో ఈ వార్ లోకి దిగుతుంది. బన్నీ క్రేజ్ తో బుకింగ్స్ అలాగే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ టెన్షన్ పెట్టే సన్నివేశం ఎదైనా ఉంది? అంటే అది బన్నీ యాంటీ వర్గం నుంచని చెప్పాలి. బన్నీ ఏపీ పొలిటికల్ లీడర్ కి సపోర్ట్ చేయడంతోనే ఈ తంటంతా వచ్చిందన్నది అందరికీ తెలిసిందే.
ఇప్పుడా వ్యతిరేక వర్గమే కాచుకుని కుర్చుంది. మునుపటి కంటే ఇప్పుడు ఆ వేడి వాతావరణం కాస్త చల్లబడినట్లు కనిపించినా? రిలీజ్ తర్వాత వాళ్లంతా ఎలా రియాక్ట్ అవుతారు? ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ బన్నీ అండ్ కో ఏమాత్రం వాటిని ఖాతరు చేయడం లేదు. సై అంటే సై అంటూ ముందుకెళ్తున్నారు. నా కంటూ ఓ ఆర్మీ ఉందని..వాళ్లే చూసుకుంటారనే ఓ ధీమా కనిపిస్తుంది. మరి ఈ ప్రీమియర్ విషయంలో వాళ్ల నుంచి పాజిటివ్? నెగిటివిటీ ఎలా ఉంటుందన్నది చూడాలి.