పుష్ప2.. ఆ ఒక్కటి కూడా తప్పుకుంది
కచ్చితంగా నార్త్ లో ఈ మూవీ మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అనే మేకర్స్ భావిస్తున్నారు.
By: Tupaki Desk | 6 Nov 2024 7:25 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మోస్ట్ అవైటెడ్ చిత్రంగా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. కచ్చితంగా నార్త్ లో ఈ మూవీ మొదటి రోజు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ అందుకోవడం గ్యారెంటీ అనే మేకర్స్ భావిస్తున్నారు. బాలీవుడ్ లో అనిల్ తడాని ‘పుష్ప 2’ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి పోటీగా వికీ కౌశల్ ‘ఛావా’ మూవీని కన్ఫర్మ్ చేశారు. డిసెంబర్ 6న ఈ సినిమా రిలీజ్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ‘ఛావా’ సినిమాపై హిందీలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రాబోతోంది. ‘పుష్ప 2’, ‘ఛావా’ మధ్య డిసెంబర్ మొదటి వారంలో గట్టి పోటీ ఉండటం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు.
బాలీవుడ్ వెర్సస్ టాలీవుడ్ ఫైట్ కచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతోందనే టాక్ నడిచింది. అయితే ‘పుష్ప 2’ సినిమాతో పోటీ పడితే కచ్చితంగా రిస్క్ ఉంటుందని ‘ఛావా’ మేకర్స్ భావించారు. దీంతో ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉందని బిటౌన్ లో టాక్ వినిపిస్తోంది. ‘పుష్ప 2’, ‘ఛావా’ సినిమాలు రెండు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే కావడంతో ఒకేసారి పోటీ పడితే కచ్చితంగా రెండింటికి నష్టం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారంట.
ఈ రెండు సినిమాలలో కూడా రష్మిక మందన హీరోయిన్ గా చేయడం విశేషం. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’తో పోటీ నుంచి ‘ఛావా’ తప్పుకోవడంతో సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘పుష్ప 2’తో ‘ఛావా’ పోటీ పడలేకపోయిందని కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ లేకపోవడం మంచిదని అంటున్నారు.
పోటీ పడితే రెండు వైపులా నష్టం ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఛావా’ రిలీజ్ వాయిదా పడటంతో నార్త్ లో విక్కీ కౌశల్ కంటే అల్లు అర్జున్ కే ఎక్కువ ఇమేజ్ ఉందని అభిమానులు గొప్పగా పోస్టులు పెడుతున్నారు. ఛావా రిలీజ్ వాయిదా పడటంతో ఇప్పుడు ‘పుష్ప 2’ కి హిందీలో సోలో రిలీజ్ దొరికినట్లే. ఇది కలెక్షన్స్ పరంగా కూడా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు.