'పుష్ప 2'.. టార్గెట్ రీచ్ అయినట్లేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చూపిస్తోంది.
By: Tupaki Desk | 6 Dec 2024 8:45 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర చూపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ క్రేజీ సీక్వెల్.. ఓపెనింగ్ డే వసూళ్లతో చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ₹ 280 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు వర్గాలు వెల్లడించాయి. RRR (₹ 223 కోట్లు) రికార్డును బ్రేక్ చేసి, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండియన్ ఓపెనర్‌గా నిలిచినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనినింగ్ డే గ్రాస్ సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రికార్డ్ క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు.
'పుష్ప 2: ది రూల్' సినిమా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ₹ 87 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది షారుఖ్ ఖాన్ 'జవాన్' మూవీని అధిగమించి, బిగ్గెస్ట్ హిందీ ఓపెనర్‌గా అవతరించిందని బాలీవుడ్ క్రిటిక్స్ వెల్లడించారు. ఇక నేషనల్ చైన్స్ లో రెండో రోజు హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 226K టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది సెకండ్ డే హయ్యెస్ట్ ప్రీ-సేల్స్ జరిగిన సినిమా ఇదే. చూస్తుంటే నార్త్ సర్క్యూట్స్ లో బాక్సాఫీస్ వద్ద రెండో రోజు కూడా 'పుష్ప 2' ప్రభంజనం కొనసాగేలా కనిపిస్తోంది. ఇక శని, ఆదివారాల్లో హిందీలో ఊహించని వసూళ్లు ఖాయమనిపిస్తోంది.
'పుష్ప 1' సినిమా నార్త్ బెల్ట్ లో 100 కోట్లకు పైగా వసూళ్లతో ఎవరూ అనుకోని విధంగా సక్సెస్ సాధించింది. అందులో నిర్మాతలకు ఎంత వచ్చిందనేది పక్కన పెడితే, హీరో అల్లు అర్జున్ కి మాత్రం ఉత్తరాదిలో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. అక్కడి జనాలు పుష్పరాజ్ పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు సుకుమార్ ''పుష్ప 2'' చిత్రాన్ని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. మూవీ మేకింగ్, టేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్, యాక్షన్స్ సీన్స్.. ఇవన్నీ ఎక్కవగా నార్త్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేయడానికే ప్లాన్ చేసారేమే అనే సందేహాలు కలుగుతాయి.
'పుష్ప 2: ది రూల్'లో బన్నీ డ్రెస్సింగ్ స్టైల్, గుట్కా నమలడం, జీపు మీద కూర్చుని తిరగడం.. ఇలా చాలా మాస్ ఎలిమెంట్స్ యూపీ, బీహార్, ఛత్తీస్ ఘడ్ లాంటి నార్త్ స్టేట్స్ యూత్ ని ఆకట్టుకోడానికే పెట్టినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు తెలుగులో కాస్త ఓవర్ గా అనిపిస్తున్నాయి కానీ, అవే ఇప్పుడు హిందీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతున్నాయి. నార్త్ ఇండియాలో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మాస్ థియేటర్లలో 'పుష్ప 2' ఇంపాక్ట్ గట్టిగా కనిపిస్తోంది.
నిజానికి 'పుష్ప 2' చిత్రానికి మొదటి నుంచే హిందీలో మంచి క్రేజ్ ఉంది. దీన్ని చూసే 'సింగం ఎగైన్' 'ఛావా' లాంటి బాలీవుడ్ చిత్రాలను పోస్ట్ పోన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ స్వయంగా పాట్నా, ముంబై నగరాలకు వెళ్లి ఈ సినిమాని దూకుడుగా ప్రమోట్ చేసారు. దీనికి తగ్గట్టుగా, అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమా నార్త్ లో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే రాబోయే రోజుల్లోనూ బాక్సాఫీస్ వసూళ్లు స్ట్రాంగ్ గా ఉంటాయనిపిస్తోంది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద కూడా చూపించే అవకాశం ఉంది. వీకెండ్ తర్వాత ఎలాగూ టికెట్ రేట్లు తగ్గిస్తారు కాబట్టి, లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ గ్యారంటీ.
పాన్ ఇండియా సినిమాకి నార్త్ మార్కెట్ కీలకమనే సంగతి తెలిసిందే. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' మూవీ హిందీ బెల్ట్ లో రూల్ చేస్తోంది. ఒకరకంగా పుష్ప మేకర్స్ టార్గెట్ రీచ్ అయినట్లే అనుకోవాలి. ఉత్తరాదిలో ఈ స్థాయిలో వసూళ్లు వస్తున్నాయంటే, కొన్ని రోజుల్లోనే బన్నీ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో.