పుష్ప 2 బాక్సాఫీస్.. జెట్ స్పీడులో మరో బిగ్ నెంబర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 26 Dec 2024 12:05 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఇప్పటికే రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇండియన్ సినిమాలలో అత్యధిక వసూళ్లు అందుకున్న మూడో చిత్రంగా కూడా సరికొత్త రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. అలాగే బాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. ఇలా ‘పుష్ప 2’ ఖాతాలో వరుస రికార్డులు వచ్చి చేరాయి.
రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టింది. తద్వారా అత్యధిక వేగంగా ఈ చిత్రం 1700 కోట్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి టోటల్ గా 1705 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ‘బాహుబలి 2’ ఆల్ టైం కలెక్షన్స్ కి 100 కోట్ల దూరంలో ఈ చిత్రం ఉంది. అయితే ఈ సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు. నిజానికి ‘పుష్ప 2’ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని మేకర్స్ అంచనా వేశారు.
అయితే ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు. అందరి అంచనాలని దాటి ఈ సినిమా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా నార్త్ ఇండియన్ బెల్ట్ లో అయితే కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. మూడో వారంలో కూడా ఈ సినిమాకి 10 కోట్లకి పైగా కలెక్షన్స్ నిలకడగా వస్తూ ఉండటం విశేషం.
దీనిని బట్టి అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఏ స్థాయిలో ఆధరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా హిందీ కలెక్షన్స్ 750 కోట్లకి దగ్గర్లో ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో కూడా 30 మిలియన్ క్లబ్ లో ఈ చిత్రం చేరిపోయింది. నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాలర్స్ కి దగ్గరగా చిత్ర వసూళ్లు ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి, సుకుమార్ క్రియేటివ్ విజన్ కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ కొత్త వివాదం రాజుకుంది. సినిమాలో సన్నివేశాలు పోలీసులని కించపరిచే విధంగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. దీనిపై తెలంగాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకి ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసుల నుంచి ఎవరూ కూడా ముందుకొచ్చి ఈ సన్నివేశాలపై అభ్యంతరం చెప్పలేదు. తెలంగాణలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగాయనే మాట కూడా వినిపిస్తోంది. రష్మిక మందన్న కెరియర్ లో కూడా ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీతో బాలీవుడ్ లో ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఇక ఫైనల్ గా సినిమా కలెక్షన్లు ఇంకా ఎక్కడి వరకు కొనసాగుతాయో చూడాలి.