Begin typing your search above and press return to search.

బిగ్గెస్ట్ రిలీజ్.. పుష్ప 2 ఆల్‌టైం రికార్డు

అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప ది రూల్’ మూవీపై ఉన్న బజ్‌కు అనుగుణంగానే దీనికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   26 Oct 2024 10:50 AM GMT
బిగ్గెస్ట్ రిలీజ్.. పుష్ప 2 ఆల్‌టైం రికార్డు
X

దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రాలు కొన్ని ఉన్నాయి. అందులో ‘పుష్ప ది రూల్’ (పుష్ప 2) ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ.. గతంలో వచ్చి ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై హైప్ గణనీయంగా పెరుగుతూనే ఉంటోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా మూవీనే ‘పుష్ప ది రూల్’. గంథపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో ఇది మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగంగా చేయాలని చూస్తున్నారు.

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప ది రూల్’ ఆరంభంలోనే పాజిటివ్ బజ్‌ను ఏర్పరచుకుంది. దీనికితోడు ఇప్పటికే దీని నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు అన్నీ ఆకట్టుకున్నాయి. మిగిలిన వాటిని సైతం ప్లాన్ ప్రకారం విడుదల చేయాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ ఛాకచక్యంగా వ్యవహరించాలని సుకుమార్ టీమ్ భావిస్తోంది.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ‘పుష్ప ది రూల్’ మూవీపై ఉన్న బజ్‌కు అనుగుణంగానే దీనికి రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై సరైన క్లారిటీ లేకున్నా.. టాలీవుడ్‌లో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రాల జాబితాలో ఇది చేరిపోయినట్లు చెప్తున్నారు. ఈ బిజినెస్ ప్రకారమే ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నారని ఓ న్యూస్ తాజాగా లీకైంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘పుష్ప ది రూల్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 11500 థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ చూస్తుందట. అదే జరిగితే ఈ చిత్రం టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును నమోదు చేస్తుంది. ఈ క్రమంలోనే RRR మూవీ పేరిట ఉన్న 10200 థియేటర్ల టాప్ రికార్డును సైతం ఇది బ్రేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘పుష్ప’ టీమ్ ప్లానింగ్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

‘పుష్ప ది రూల్’ సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుక రాబోతున్నారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుండగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్, అజయ్‌లు కీలక పాత్రలు చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి మ్యూజిక్ ఇస్తున్నాడు.