పుష్ప-2.. అతనికి బిగ్ సవాల్
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గాను బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
By: Tupaki Desk | 20 Aug 2024 2:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప-2 మూవీ కోసం సినీ ప్రియులు, బన్నీ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో ఓ రేంజ్ లో అలరించారు. బాడీ లాంగ్వేజ్ తో విపరీతంగా ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ చిత్రం అన్ని భాషల్లో హిట్ అయింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా గాను బన్నీ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప సీక్వెల్ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. చాలా కాలం క్రితం మొదలైన పుష్ప-2 షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. పుష్పకు మించిన అంచనాలు పుష్ప-2పై నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై అంచనాలను మరిన్ని పెంచాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఇక పుష్ప-2 నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు సాంగ్స్ ఎలాంటి రెస్పాన్స్ అందుకున్నాయో మీకు తెలిసిందే. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. రెండు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.. సీక్వెల్ కు మరింత క్రేజీ మ్యూజిక్ అందిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే సోషల్ మీడియాలో ఓ చర్చ మొదలైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ పుష్ప-2 మూవీ రిలీజ్.. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చేతిలోనే ఉందని చెబుతున్నారు.
ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన పుష్ప-2.. డిసెంబర్ కు వాయిదా పడింది. ఇప్పటికే దేవి రెండు పాటలు రిలీజ్ చేయగా.. త్వరలో మూడో పాటను విడుదల చేయనున్నారు. అయితే సాంగ్స్ విషయంలో ఫుల్ స్పీడ్ గా ఉండే డీఎస్పీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రం కాస్త టైమ్ తీసుకుని వర్క్ చేస్తారు. పెద్ద పెద్ద సినిమాలకు అయితే ఇంకాస్త సమయం ఎక్కువే తీసుకుంటారు. కచ్చితంగా సినిమా రిలీజ్ కు రెండు నెలల ముందు ఆయనకు మొత్తం ఫుటేజ్ అప్పజెప్పాల్సిందే!
ఈ లెక్కన చూసుకుంటే.. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పుష్ప-2 రిలీజ్ అవ్వనుంది కనుక సెప్టెంబర్ లాస్ట్ కల్లా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడే వర్క్ చేసేందుకు డీఎస్పీకి రెండు నెలల టైమ్ దొరుకుతుంది. కానీ సుకుమార్ మాత్రం.. 40 డేస్ ముందు మొత్తం అవుట్ పుట్ ఇస్తానని చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో దేవికి ఇది పెద్ద సవాలే. రెండు నెలల్లో చేద్దామనుకున్న వర్క్ 40 రోజుల్లో చేయాల్సి ఉంది. అలా డీఎస్పీపై ఒత్తిడి బాగానే పడేటట్లు కనిపిస్తోంది. అయితే దేవి వర్క్ పై నమ్మకం ఉంది. కాబట్టి తన వర్క్ తో సినిమా ద్వారా ఎలా మెప్పిస్తారో అంతా వేచి చూడాలి.