పుష్ప బడ్జెట్.. ఎందుకంత పెరిగినట్లు?
బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ మామూలుగా కష్టపడట్లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
By: Tupaki Desk | 27 Jan 2024 5:42 AM GMTసినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ ఒకటి. 2021లో రిలీజైన పుష్ప: ది రైజ్.. పాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ మొదలైనప్పటి నుంచి సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అవి అంతకంతకూ పెరుగుతన్నాయే తప్ప తగ్గట్లేదు.
బన్నీ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడానికి డైరెక్టర్ సుకుమార్ అండ్ టీమ్ మామూలుగా కష్టపడట్లేదని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. సుక్కూ మాస్టర్ తన టీమ్ తో ఫుల్ కసరత్తు చేస్తున్నారట. సినిమాలోని చిన్న చిన్న సీన్లు తీయడానికి కూడా అన్నుకున్న టీమ్ కన్నా ఎక్కువ సమయం పడుతోందట. ప్రసుత్తం హైదరాబాద్ లో భారీ సెట్లు వేసి షూట్ చేస్తున్నారట. గంగమ్మ జాతర సీక్వెన్స్ అయితే ఒక రేంజ్‌లో తెరకెక్కించారట.
రూ.350 కోట్లతో పుష్ప సీక్వెల్ ను తీయాలని మేకర్స్ ముందుగా ప్లాన్ చేశారట. కానీ ఫెర్ఫెక్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు కొన్ని సీన్లను రీషూట్ చేస్తున్నారట. దీంతో ఇప్పుడు మూవీ బడ్జెట్ డబుల్ అయిందట. సుమారు రూ.600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన నాలుగో పాన్ ఇండియా చిత్రంగా పుష్ప నిలవనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్, కల్కి 2898 AD ఈ ఘనతను సాధించాయి
ఈ చిత్రంలో కూడా అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాదే ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
అయితే ఈ మూవీ విడుదల వాయిదా పడుద్దని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో కాకుండా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుద్దని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై ఇటీవలే బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీకే సినిమా రిలీజ్ అవుతుందని చెప్పింది. జూన్ కల్లా ఫస్ట్ కాపీ కూడా రెడీ అవ్వుద్దని స్పష్టం చేసింది. మరేం జరుగుతుందో చూడాలి.