Begin typing your search above and press return to search.

పుష్ప 2: జాత‌ర సీన్‌ని కొట్టేలా హెలీకాఫ్ట‌ర్ ఫైట్

ఈ చిత్రం క్లైమాక్స్‌కి సంబంధించిన కొంత భాగాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నార‌ని స‌మాచారం ఉంది. మేక‌ర్స్ ఇటీవల ఒక క్లిప్‌ను విడుదల చేసి.. ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 5:12 AM GMT
పుష్ప 2: జాత‌ర సీన్‌ని కొట్టేలా హెలీకాఫ్ట‌ర్ ఫైట్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప 2: ది రూల్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ రిలీజ్‌ల‌లో ఒక‌టి. 1000 కోట్ల క్ల‌బ్ ల‌క్ష్యంగా రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్ర‌మిద‌ని ప్ర‌చారం సాగింది. మొద‌టి భాగం కంటే అధిక బ‌డ్జెట్ భారీ కాన్వాస్ ని ఎంపిక చేసుకుని సుకుమార్ భారీ ప్ర‌యోగం చేస్తున్నాడ‌ని క‌థ‌నాలొస్తున్నాయి. పుష్ప‌1 దాదాపు 350 కోట్లు వ‌సూలు చేయ‌గా, ఇప్పుడు రెండో పార్ట్ అంత‌కు మూడు నాలుగు రెట్లు వ‌సూలు చేయాల‌ని అల్లు అర్జున్- సుకుమార్ బృందం క‌సిగా ప‌ని చేస్తున్నారు.

ఈ చిత్రం క్లైమాక్స్‌కి సంబంధించిన కొంత భాగాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నార‌ని స‌మాచారం ఉంది. మేక‌ర్స్ ఇటీవల ఒక క్లిప్‌ను విడుదల చేసి.. ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. ''షూట్ అప్‌డేట్: పుష్ప 2 ది రూల్ ప్రస్తుతం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నాం. క్లైమాక్స్ సీన్ ఇది'' అని తెలిపారు. సెప్టెంబర్ లో అల్లు అర్జున్ ప‌లు కీల‌క సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటారు. అత‌డితో పాటు అతడి గ్యాంగ్ సభ్యులు, ఇతర పాత్రలతో కొన్ని యాక్షన్ పోర్షన్‌లను శ్రీలంక అరణ్యాల్లో భీక‌రంగా తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.

అల్లు అర్జున్ పాత్ర పుష్ప రాజ్ భార‌త‌దేశంతో పాటు, చుట్టుపక్కల దేశాలకు తన స్మగ్లింగ్ వ్యాపారాన్ని విస్తరించడంతో రెండవ భాగంలో మొద‌టి భాగం కంటే భారీ పోరాటాల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. ఇందులో అమ్మవారి జాత‌ర‌కు సంబంధించిన సీన్ ఇప్ప‌టికే భారీత‌నంతో సినిమాకే హైలైట్ గా నిలుస్తుంద‌ని టాక్ ఉంది. తాజా స‌మ‌చారం మేర‌కు దీనిని కొట్టే స‌న్నివేశాలు ఇందులో ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిలో హెలీకాఫ్ట‌ర్ల‌తో చిత్రీక‌రించిన స‌న్నివేశం సినిమా మొత్తానికి ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇది సుకుమార్ శైలిలో ఎంతో స్టైలిష్ మేకింగ్ తో అల‌రిస్తుంద‌ని లీకులు అందాయి.

ఈసారి సీక్వెల్ స్టోరిలో పాత్ర‌లు ఒక‌దానిని మించి ఒక‌టిగా హైలైట్ గా క‌నిపించ‌నున్నాయి. ఈ చిత్రంలో మొదటి భాగం నుండి రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. మేకర్స్ టీజర్‌ను మాత్రమే కాకుండా, రెండు పాటలను కూడా విడుదల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే రచ్చ రచ్చ చేసిన పుష్ప పుష్ప పుష్ప, సూసేకి స్టెప్పులను కాపీ కొడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో హోరెత్తిస్తున్నారు.

మూడు నెల‌లు వెయిటింగ్:

అయితే పుష్ప 2 రాక కోసం ఇంకో మూడు నెల‌లు అభిమానులు వేచి చూడాల్సి ఉంది. ఆగస్టు 15న రావాల్సిన ఈ చిత్రం డిసెంబ‌ర్ కి వాయిదా ప‌డిన సంగ‌తి విధిత‌మే. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ సినిమా రిలీజ్ ఇప్ప‌టికే వాయిదా ప‌డింది. డిసెంబ‌ర్ లో రిలీజ్ చేసేందుకు ఇప్ప‌టికే డేట్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రం 6 డిసెంబర్ 2024న విక్కీ కౌశల్ 'ఛావా'తో ఢీకొడుతుంది.