Begin typing your search above and press return to search.

పుష్ప 2 క్లైమాక్స్.. ఈమాత్రం సరిపోదా..

దీనికి పుష్ప ట్విట్టర్ నుంచి సరిపోదా శనివారం ట్రైలర్ లో నాని, సూర్యకి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ క్లిప్ ని షేర్ చేశారు.

By:  Tupaki Desk   |   26 Aug 2024 5:30 PM GMT
పుష్ప 2 క్లైమాక్స్.. ఈమాత్రం సరిపోదా..
X

ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉన్న సినిమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ టాప్ లో ఉంటుంది. ఈ సినిమా కోసం సౌత్ ఆడియన్స్ కంటే నార్త్ ఇండియన్ మూవీస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం పుష్ప 1కి హిందీలో వచ్చిన ఆదరణ. ఎలాంటి అంచనాలు లేకుండా హిందీలో రిలీజ్ అయిన పుష్ప మూవీ హిందీలో 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది.

అలాగే ఓవర్సీస్ లో కూడా పుష్ప చిత్రానికి అపూర్వ ఆదరణ లభించింది. మరో సారి పుష్ప రాజ్ క్యారెక్టర్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూడాలని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఆగష్టు 15న రిలీజ్ కావాల్సిన సినిమాని షూటింగ్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ కి వాయిదా వేశారు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా పుష్ప ది రూల్ మూవీ ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది.

కేరళలో కూడా అల్లు అర్జున్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో అక్కడి ఫ్యాన్స్ కూడా పుష్ప ది రూల్ రాకకోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సుకుమార్ ప్రస్తుతం పుష్ప ది రూల్ మూవీ క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఘట్టాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయంట.

ఈ సీక్వెన్స్ చాలా అద్భుతంగా ఉండబోతోందనే ప్రచారం నడుస్తోంది. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పుష్ప ది రూల్ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చెప్పాలని ట్విట్టర్ లో రిక్వెస్ట్ పెట్టారు. దీనికి పుష్ప ట్విట్టర్ నుంచి సరిపోదా శనివారం ట్రైలర్ లో నాని, సూర్యకి వార్నింగ్ ఇచ్చే డైలాగ్ క్లిప్ ని షేర్ చేశారు. అందులో పోతారు… మొత్తం పోతారు అంటూ నాని చెబుతాడు.

ఈ ఒక్క డైలాగ్ తో మూవీ క్లైమాక్స్ ఎలా ఉండబోతోందనేది క్లారిటీ ఇచ్చేశారు. ఈ ట్వీట్ లో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పుష్పకి మించిన బ్లాక్ బస్టర్ హిట్ ని పుష్ప ది రూల్ సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి వారి అంచనాలని పుష్ప ది రూల్ ఏ మాత్రం అందుకుంటుంది అనేది వేచి చూడాలి.