`పుష్ప-2` సెట్స్‌లో దీనికి అనుమతి లేదు!
ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ సినిమా రాక కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు.
By: Tupaki Desk | 31 May 2024 6:17 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ తెరకెక్కిస్తున్న `పుష్ప 2` ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. హిందీ ఆడియెన్ ని కలుపుకుని భారతదేశంలో అల్లు అర్జున్ అసాధారణ స్టార్ డమ్ దృష్ట్యా ఈ సినిమా సంచలన వసూళ్లను సాధిస్తుందని ఒక అంచనా. `పుష్ప 2`తో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాయాలని సుకుమార్ కలలు కంటున్నారు. దానికి తగ్గట్టే విజువల్ రిచ్ కంటెంట్ ని హాలీవుడ్ ప్రమాణాలతో అందించేందుకు సర్వం సిద్ధం చేసారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసమే నాణ్యమైన సుదీర్ఘ సమయాన్ని తీసుకున్నారు.
ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ సినిమా రాక కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. `పుష్ప1: ది రైజ్` భారీ విజయాన్ని సాధించడంతో పార్ట్ 2 పైనా అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పుష్ప 2 నుంచి `పుష్ప పుష్ప..` పాట, జంట సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. దీంతో పుష్ప 2పై ఉత్కంఠ పెరిగింది. పాటలతో పాటు యాక్షన్ కంటెంట్ ప్రేక్షకుల్ని కుర్చీ అంచుపై కూచోబెడుతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న లొకేషన్ నుండి ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వడానికి మేకర్స్ అనుమతించడం లేదని సమాచారం. ఇప్పటివరకూ పుష్ప 2 కి సంబంధించి హద్దు మీరిన లీకులేవీ లేవు. అందుకే ఈ క్రేజ్‌ను ఏదీ పాడుచేయకుండా చూసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాన్ని అత్యంత గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు. లొకేషన్ నుంచి లీకులేవీ లేకుండా చిత్రబృందం చాలా జాగ్రత్తగా ఉందని తెలుస్తోంది. ఇదే కాకుండా క్లైమాక్స్ పర్ఫెక్ట్గా పూర్తవుతుందని నిర్ధారించుకోవడానికి స్క్రిప్ట్‌కి యాక్సెస్ అందరికీ ఇవ్వలేదని .. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే సీన్ గురించి తెలుసుకునే అవకాశం ఉండేలా పరిమితం చేసారని గుసగుస వినిపిస్తోంది. ఇది అభిమానుల ఊహలకు మరింతగా రెక్కలు తొడిగేందుకు ఆస్కారం కల్పిస్తోంది. ఇటీవల `పుష్ప 2` లో స్పైసీ నంబర్ కోసం యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని సంప్రదించినట్లు కూడా కథనాలొచ్చాయి.
పుష్ప: ది రైజ్‌లో సమంత రూత్ ప్రభు `ఊ అంటావా ఊ ఊ అంటావా` అంటూ అందరినీ పిచ్చెక్కించింది. ఈసారి ఆ భాగాన్ని త్రిప్తి దిమ్రీ పూర్తి చేస్తుంది. కానీ ఇంకా ఏదీ అధికారికంగా కన్ఫామ్ కాలేదు. పుష్ప 2: ది రూల్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా 15 ఆగస్ట్ 2024న విడుదల కానుంది.