Begin typing your search above and press return to search.

పుష్ప 2 కపుల్ సాంగ్.. ఇదేదో కొత్తగా ఉందే..

ఇటీవల, "పుష్ప 2" టీమ్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు విశేష స్పందన వచ్చింది.

By:  Tupaki Desk   |   28 May 2024 7:11 AM GMT
పుష్ప 2 కపుల్ సాంగ్.. ఇదేదో కొత్తగా ఉందే..
X

"పుష్ప 2" సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, "పుష్ప: ది రైజ్" విజయం తరువాత మరింత అంచనాలను నెలకొల్పింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల, "పుష్ప 2" టీమ్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు విశేష స్పందన వచ్చింది.

మేకర్స్ ఈ సక్సెస్‌ని కొనసాగిస్తూ, మే 29న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు మరో పాటను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సాంగ్‌లో రష్మిక మందన్నా, అల్లు అర్జున్ తమ స్టెప్పులతో మరింత ఆకట్టుకోబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సంగీతం పుష్పరాజ్, శ్రీవల్లి మధ్య ఉన్న కెమిస్ట్రీని హైలెట్ చేయనుంది. అయితే ఇది కాస్త కొత్తగా కపుల్ సాంగ్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు.

"సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ" అనే ఈ పాటలో తన ఐకానిక్ స్టెప్పుతో కూడా ఈ జోడి ఆకట్టుకోబోతోంది. ఈ కపుల్ సాంగ్ శ్రేయ ఘోషల్ పాడారు, పాట మంచి మెలోడీగా ఉండేలా ఉంది. ఇక రీసెంట్ గా మరో స్టిల్ విడుదల చేయగా జోడి లేటెస్టు ట్రెండుకు తగ్గట్లే రెడీ అయ్యి రొమాంటిక్ స్టిల్ ఇచ్చారు. చూస్తూంటే ఇది ట్రెండ్ అయ్యేలా ఉందనిపిస్తోంది.

"పుష్ప 2" లో మొత్తం 5 పాటలు ఉంటాయని సమాచారం. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రతి సారి హిట్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్‌తో కలిసి వచ్చిన ప్రతి సినిమాకు బెస్ట్ మ్యూజిక్ తో మెప్పించినట్లు, ఈ సారి కూడా అలాగే ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ సాంగ్ కోసం పలు ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు.

జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, కానీ తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. "పుష్ప: ది రైజ్" మంచి విజయాన్ని సాధించిన తరువాత, "పుష్ప 2" పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్రబృందం ఈ విడుదల తేదీని అందుకోవడానికి చాలా కష్టపడుతోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి.