Begin typing your search above and press return to search.

పుష్ప 2 - ఇంకా ఆ డీల్స్ క్లోజ్ కాలేదా?

నిర్మాతలు కోట్ చేసిన ధరలకి రైట్స్ ని కొనడానికి డిస్టిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   30 May 2024 4:44 AM GMT
పుష్ప 2 - ఇంకా ఆ డీల్స్ క్లోజ్ కాలేదా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప ది రూల్. బ్లాక్ బస్టర్ మూవీ పుష్పకి సీక్వెల్ గా రెడీ అవుతోన్న ఈ సినిమా ఆగష్టు 15న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. అల్లు అర్జున్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా ఈ చిత్రాన్ని నిలపాలని మైత్రీ మూవీ మేకర్స్ భావిస్తోంది.

అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కోసం 300+ కోట్లకి పైగా ఖర్చు పెట్టారు. డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు అమ్మేశారు. హిందీ థీయాట్రికల్ రైట్స్ కూడా సాలిడ్ ధరకి అమ్ముడయ్యింది. రిలీజ్ కి ముందే పుష్ప ది రూల్ కి టేబుల్ ప్రాఫిట్ వస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఈ చిత్రంపై ఉన్న హైప్ కారణంగా డిస్టిబ్యూటర్స్ కూడా రైట్స్ కోసం పోటీ పడటం పక్కా అని అందరు అనుకున్నారు.

అయితే థీయాట్రికల్ రైట్స్ విషయంలో నిర్మాతల డిమాండ్ డిస్టిబ్యూటర్స్ ని భయపెడుతుందంట. నిజానికి పుష్ప మొదటి పార్ట్ తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ మాత్రమే అందుకుంది. డిస్టిబ్యూటర్స్ కి పెద్దగా లాభాలు అయితే ఇవ్వలేదు. హిందీలో 100 కోట్లకి పైగా కలెక్ట్ చేయడంతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే పుష్ప ది రూల్ విషయంలో నిర్మాతలు తెలుగు థీయాట్రికల్ రైట్స్ కోసం ఈ సారి ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారంట. నిర్మాతలు కోట్ చేసిన ధరలకి రైట్స్ ని కొనడానికి డిస్టిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నారనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అందుకే ఇంకా తెలుగు రాష్ట్రాలకి సంబందించిన థీయాట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ కాలేదంట.

ఇంకా నిర్మాతలు డిస్టిబ్యూటర్స్ మధ్య చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ వారంలో రైట్స్ డీల్ మేగ్జిమమ్ క్లోజ్ అయ్యే అవకాశం ఉందంట. అయితే ఎంత ధరకి ఫైనల్ గా డీల్ సెట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉందంట. ఒక వేళ అనుకున్న విధంగా డీల్స్ సెట్ కాకుంటే మైత్రీ మూవీ మేకర్స్ సొంతంగా రిలీజ్ చేసుకోవాలనే ఆలోచనతో కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పుష్ప ది రూల్ నుంచి రష్మిక మందన్న మీద చిత్రీకరించిన సాంగ్ ని సెకండ్ సింగిల్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.