డిసెంబర్ 6 .. పుష్పరాజ్‌ని ఢీకొట్టే మొనగాడెవరు?
2024 డిసెంబర్ లో రాబోయే బాలీవుడ్ సినిమాల జాబితా పరిశీలిస్తే.... విడుదల తేదీల వారీగా డేటా ఇలా ఉంది.
By: Tupaki Desk | 16 Aug 2024 6:39 AM GMT2024 డిసెంబర్ లో రాబోయే బాలీవుడ్ సినిమాల జాబితా పరిశీలిస్తే.... విడుదల తేదీల వారీగా డేటా ఇలా ఉంది.
06 డిసెంబర్ 2024న విక్కీ కౌశల్ నటించిన `చావా` విడుదలవుతోంది. 08 డిసెంబర్ 2024న అభయ్ వర్మ నటించిన `సఫేద్` రిలీజ్ కానుంది. ఇదే తేదీకి `నల్ల గులాబీ` అనే సినిమా థియేటర్లలోకి వస్తుండగా, 09 డిసెంబర్ 2024న టైగర్ ష్రాఫ్ రాంబో విడుదల కావాల్సి ఉంది.
ఒకవేళ విక్కీ కౌశల్- చావా, టైగర్ ష్రాఫ్- రాంబో విడుదలకు వస్తే అవి కచ్ఛితంగా పుష్ప 2 చిత్రానికి పోటీగా నిలుస్తాయని విశ్లేషకులు భావించారు. అయితే రేసులోంచి చాలా ముందే టైగర్ ష్రాఫ్ `రాంబో` తప్పుకుంది. ఈ సినిమా మేకింగ్ గురించి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం లేదు. టైగర్ ష్రాఫ్ నటించిన వరస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారడంతో అతడు నటించే `రాంబో` చిత్రాన్ని వాయిదా వేసారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టైగర్ నటించే సినిమా ఏదీ డిసెంంబర్ రేస్ లో రాదు.
ఇక విక్కీ కౌశల్ నటించిన `చావా` ఒక్కటీ డిసెంబర్ 6న వస్తున్న `పుష్ప 2`కి పోటీగా నిలవబోతోంది. ఇతర సినిమాలు రేసులో ఉన్నా అవేవీ ఈ రెండు చిత్రాలకు పోటీగా రేసులో నిలవలేవు. అయితే విక్కీ నటించిన చావా కంటెంట్ పుష్ప 2 కంటెంట్ తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా చావా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనలు అందుకుంది. శంభాజీ జీవితంలో అన్ని యాక్షన్ సీన్లు లేవు అంటూ కొందరు ఎగతాళి చేయడం, శంభాజీ పాత్రలో డెప్త్ కనిపించడం లేదని కొందరు విమర్శించడం ఆన్ లైన్ లో కనిపించింది. అంతేకాదు.. ఇలాంటి కంటెంట్ విక్కీ కంటే సన్నీడియోల్ లాంటి యాక్షన్ హీరోకి బాగా సూటవుతుందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి హాస్యాస్పదమైన యాక్షన్ సన్నివేశాలు సన్నీ డియోల్‌కు సరిపోతాయి తప్ప విక్కీ కౌశల్‌కు సరిపోవు! అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. మహారాష్ట్రుడు అయిన శివాజీ వారసుని కథతో సినిమా తెరకెక్కుతోంది అంటే ఉత్తరాదిన ఆసక్తి నెలకొంటుంది. కానీ దానికి భిన్నంగా టీజర్ నిరాశపరిచింది.
అయితే విక్కీ కౌశల్ `చావా` సంగతి ఎలా ఉన్నా కానీ, నిజానికి పుష్ప చిత్రం ఉత్తరాదిన సాధించిన అసాధారణ విజయం దృష్ట్యా `పుష్ప 2` మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రంగా చర్చల్లో ఉంది. గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన చిత్రంగాను పుష్ప 2 రికార్డుల్లో నిలిచింది. పుష్ప లో కంటెంట్ వైవిధ్యం, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రతిదీ ఉత్తరాది ఆడియెన్ ని విపరీతంగా ఆకర్షించాయి. ముఖ్యంగా బన్ని ఆహార్యం, నటన డ్యాన్సింగ్ ప్రతిభకు ఫిదా అయిపోయారు. అందువల్ల పుష్ప 2 కచ్ఛితంగా ఉత్తరాది బెల్ట్ లో ఇప్పటికీ మోస్ట్ అవైటెడ్ మూవీనే. ఈ సినిమా ప్రచార కంటెంట్ తో సుక్కూ అండ్ టీమ్ మెప్పించగలిగితే హైప్ మరింతగా పెరుగుతుంది. డిసెంబర్ 6న విడుదలయ్యే సినిమాల్లో కచ్ఛితంగా పుష్ప 2 నే ఫేవరెట్ అని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు.