పుష్ప 2 ఒకటి వచ్చేస్తోంది.. అందరి చూపు అతనిపైనే..
ఇక దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులను చాలా బిజీగా మారిపోయాడు. అయితే ఇప్పుడు అతని చేతిలో ఉన్న అసలు ఆయుడం పుష్ప 2.
By: Tupaki Desk | 22 April 2024 10:53 AM GMTరాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈమధ్య కథలను సెలెక్ట్ చేయడంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు గా అనిపిస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు చాలావరకు దూరంగానే ఉంటున్నాడు. కంటెంట్ ఏమాత్రం నచ్చకపోయినా కూడా రిజెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత 15 ఏళ్ల నుంచి చూసుకుంటే దేవి ప్రతి ఏడాది నాలుగు లేదా ఐదు సినిమాలతో చాలా బిజీగా అయితే కనిపిస్తూ ఉన్నాడు. అయితే గత ఏడాది మాత్రం మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో మాత్రమే కనిపించాడు.
దేవి కమర్షియల్ సినిమాలను చాలావరకు తగ్గించడంతో తమన్ కు అది బాగా హెల్ప్ అవుతుంది. దేవి మిస్ అయితే మాత్రం దర్శక నిర్మాతలు సెకండ్ ఆప్షన్ గా తమన్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే తమన్ కూడా కొన్ని బిగ్ ప్రాజెక్టులను దేవితో పోటీపడి మరి అందుకుంటున్నాడు. ఈ క్రమంలో మరోవైపు నుంచి అనిరుద్ కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులను చాలా బిజీగా మారిపోయాడు. అయితే ఇప్పుడు అతని చేతిలో ఉన్న అసలు ఆయుడం పుష్ప 2. సుకుమార్ సినిమాలకు తప్పితే దేవి మిగతా సినిమాలకు అంత గొప్పగా మ్యూజిక్ ఇవ్వడు అనే కామెంట్ చాలాసార్లు వినిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ లో కాకపోయినా దేవి అప్పుడప్పుడు ఏదో ఒక సినిమాకు మంచి ట్యూన్స్ అయితే అందిస్తూ ఉంటాడు.
కానీ పుష్ప తర్వాత దేవి నుంచి వచ్చిన రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖి, ది వారియర్, ఎఫ్ 3, ఖిలాడి, రంగ రంగ వైభవంగా లాంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలలో సాంగ్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో ఏది కూడా క్లిక్ అయితే కాలేదు. ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 ఆల్బమ్స్ తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది.
త్వరలోనే ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నారు. మే ఫస్ట్ వీక్ లోనే ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం ఉందట. పుష్ప ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ ఎంతగా క్రేజ్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా క్యారెక్టర్ ను హైలెట్ చేసే 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అనే పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు పుష్పరాజ్ పాత్రను మరింత ఎలివేట్ చేసే విధంగా చంద్రబోస్ లిరిక్స్ రాసినట్లు తెలుస్తోంది.
ఆ లిరిక్స్ కు దీటుగా దేవిశ్రీప్రసాద్ మంచి ట్యూన్స్ అందించినట్లు సమాచారం. ఇక పాట మేకింగ్ విధానం ఊర మాస్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ తన స్టెప్పులతో పాటకు మరింత అందాన్ని తీసుకొస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొదటి సాంగ్ మాత్రం గట్టిగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దేవిశ్రీప్రసాద్ ఈసారి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడో చూడాలి.