పుష్ప 2 వాయిదా.. వారి మంచికే..
అయితే పుష్ప 2 వాయిదా పడటం వలన ఏకంగా 9 సినిమాలని ఇండిపెండెంట్స్ సందర్భంగా ప్రేక్షకులు చూడగలుగుతున్నారు.
By: Tupaki Desk | 15 Aug 2024 9:41 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ సినిమాని ఆగష్టు 15కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఈ సినిమాపై క్రియేట్ అయ్యి ఉన్నాయి. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా పుష్ప 2 కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఆగష్టు 15 అనుకున్న రిలీజ్ డేట్ వాయిదా పడింది. డిసెంబర్ 6న పుష్ప ది రూల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
ఈ సినిమా బిజినెస్ కూడా ఆల్ మోస్ట్ అన్ని భాషలలో కంప్లీట్ అయిపొయింది. నార్త్ ఇండియాలో ఈ సారి 200 కోట్లకు పైనే కలెక్షన్స్ ని పుష్ప 2 అందుకుంటుందని అంచనా వేశారు. అలాగే 1000 కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరుతుందని ట్రేడ్ పండితులు కూడా భావించారు. ఈ సినిమాపైనే బిజినెస్ 400 కోట్ల వరకు జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇంత హెవీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న సినిమా థియేటర్స్ లోకి వస్తే పబ్లిక్ అటెన్షన్ అంతా కూడా పుష్ప ది రూల్ మీదనే ఉండేది.
దీంతో కచ్చితంగా మిగిలిన హీరోలు ఎవరు కూడా పుష్ప2కి పోటీగా వచ్చే సాహసం చేసేవారు కాదు. అయితే ఈ సినిమా వాయిదా పడటంతో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో ఏకంగా 9 సినిమాలకి లైన్ క్లియర్ అయ్యిందని చెప్పాలి. తెలుగులో డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ చిత్రాలు మూడు పుష్ప 2 వాయిదా అని కన్ఫర్మ్ అయ్యాక ఆగష్టు 15 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి.
హిందీలో జాన్ అబ్రహం వేదా, అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే, రాజ్ కుమార్ రావు స్త్రీ 2 సినిమాలని కూడా పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్స్ కి ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారు. తమిళంలో తంగలాన్ సినిమా అయితే ఆగష్టు 15 రిలీజ్ డేట్ అని ముందే కన్ఫర్మ్ అయ్యింది. పుష్ప 2 రిలీజ్ అయిన కూడా ఆ చిత్రాన్ని పోటీగా దించాలని అనుకున్నారు.
ఒకవేళ ఈ రెండు పోటీ పడి ఉంటే తమిళంలో పుష్ప 2కి కొంత కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉండేది. అయితే పుష్ప 2 వాయిదా పడటం వలన ఏకంగా 9 సినిమాలని ఇండిపెండెంట్స్ సందర్భంగా ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. వీటిలో ఏ మూవీ పబ్లిక్ కి కనెక్ట్ అయితే దానికి లాంగ్ వీకెండ్ ఉపయోగపడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.