IMDb 2024 జాబితాలో కల్కి 2898 AD- పుష్ప 2
బాక్సాఫీస్ వద్ద అనిశ్చితి ఉన్నప్పటికీ 2024లో భారతీయ సినిమా కొన్ని కమర్షియల్ హిట్‌లను సాధించింది
By: Tupaki Desk | 24 July 2024 3:15 AM GMTబాక్సాఫీస్ వద్ద అనిశ్చితి ఉన్నప్పటికీ 2024లో భారతీయ సినిమా కొన్ని కమర్షియల్ హిట్‌లను సాధించింది. కల్కి 2898-AD ప్రస్తుతం 2024లో అత్యంత జనాదరణ పొందిన భారతీయ చలనచిత్రం. IMDb పేజీ వీక్షణల ద్వారా షేర్ చేసిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 6న విడుదల కానున్న `పుష్ప: ది రూల్ - పార్ట్ 2` ఈ ఏడాదిలో తదుపరి మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రం.
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్-ఐఎండిబి ప్రకారం.. సినిమాలు, టీవీ కార్యక్రమాలు, సెలబ్రిటీల గురించిన సమాచారం అందించడంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోర్స్ లలో ఒకటి. 2024లో ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలలో ప్రజలు అత్యంత ఆసక్తిగా వేచి చూస్తున్న వాటి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలు ప్రపంచవ్యాప్తంగా IMDbకి 250 మిలియన్ల నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలపై ఆధారపడి రూపొందించారు. వీరంతా ఐఎండిబి సెర్చ్‌లో ఏ సినిమా చూడాలో నిర్ణయించుకోగా దాని ఆధారంగా సర్వే జరిగింది.
ఐఎండిబికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి 2898-AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ, ``మా టీమ్ మొత్తానికి IMDb జాబితాలో చోటు దక్కడం చాలా ఆనందంగా, గౌరవంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రేక్షకుల ప్రేమను ప్రత్యక్షంగా ప్రతిబింబిస్తుందని నేను భావిస్తున్నాను. హద్దులు చెరిపేసి ముందుకు వెళ్లేందుకు ఇది మాకు స్ఫూర్తినిస్తుంది`` అని అన్నారు. మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం ఐఎండిబితో ఇంటరాక్షన్‌లో 2024లో నంబర్ 2 ర్యాంకింగ్ పొందిన భారతీయ చలనచిత్రం `మంజుమ్మెల్ బాయ్స్` స్నేహం నేపథ్యంలో సర్వైవల్ థ్రిల్లర్. అసమానతలకు వ్యతిరేకంగా విజయం సాధించే సార్వజనీన చిత్రమిది. గొప్ప విజువలైజేషన్ భాషా అవరోధాలను అధిగమించి ప్రపంచ ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. ఈ చిత్రం నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది. ప్రేక్షకుల నుండి ప్రేమ గొప్ప స్పందన దక్కింది. ఈ గౌరవానికి IMDbకి నేను కృతజ్ఞుడను అన్నారు.
IMDb 2024 జాబితాలో భారతీయ సినిమాదే అగ్రస్థానం:
ఐఎండిబి ఇండియా హెడ్ యామినీ పటోడియా మాట్లాడుతూ ``భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే వినూత్నమైన ప్రభావవంతమైన సినిమాల కోసం ప్రజల్లో ఆకలి పెరిగిందని IMDb డేటా సూచిస్తుంది. 2024 (ఇప్పటి వరకు)లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల జాబితాలో ఐదు హిందీ చిత్రాలు, మూడు మలయాళం, రెండు తెలుగు సినిమాలు విభిన్నమైన స్లేట్ లో ఉన్నాయి. ఇది భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే కథల వైపు ఆకర్షిస్తుందని హింట్ ఇచ్చింది. పుష్ప: ది రూల్ - పార్ట్ 2 (నం. 1), వెల్‌కమ్ టు ది జంగిల్ (నం. 3) సహా ఐదు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌లు లేదా పాపులర్ ఫ్రాంచైజీలు సింఘం ఎగైన్ (నం. 6), భూల్ భూలయ్యా 3 (నం. 7), స్ట్రీ 2 (నం. 10) వంటి వాటి గురించి ప్రజలు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారని సర్వే వెల్లడించింది.
2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాలు: కల్కి 2898 ఏడి, మంజుమ్మెల్ బాయ్స్, యోధ, హను మాన్, షైతాన్, లాపటా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజ్య
జనవరి-జూలై మధ్య భారతీయ సినిమాలు అత్యధిక ఐఎండిబి ర్యాంకింగ్‌ను పొందుతాయి. 1జనవరి 2024 - 10 జూలై 2024 మధ్య భారతదేశంలో విడుదలైన అన్ని చలనచిత్రాలలో సగటు ఐఎండిబి వినియోగదారు రేటింగ్ 6 లేదా అంతకంటే ఎక్కువ ఉంది. కనీసం 10,000 ఓట్లతో ఈ టైటిల్స్ ఐఎండిబి కస్టమర్‌ల ద్వారా స్థిరంగా ప్రజాదరణ పొందాయి. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి 250 మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ సందర్శకులతో పేజీ వీక్షణలు ఉన్నాయి.
2024 ద్వితీయార్థంలో మోస్ట్ అవైటెడ్ సినిమాలు: పుష్ప: ది రూల్ (పార్ట్ 2), దేవర పార్ట్ 1, వెల్ కం టు ది జంగిల్,
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, కంగువ, సింగం ఎగైన్, భూల్ భూలయ్యా 3, తంగలన్, ఔరోన్ మే కహన్ దమ్ థా, స్ట్రీ 2 జాబితాలో ఉన్నాయి. 1జనవరి 2024 - 10 జూలై 2024 మధ్య స్థిరంగా అత్యంత ప్రజాదరణ పొందిన టైటిళ్ల ఆధారంగా ఈ జాబితా సిద్ధమైంది. ఈ సమాచారం వందల కొద్దీ పేజీల వాస్తవ వీక్షణల ఆధారంగా నిర్ణయించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఐఎండిబికి మిలియన్ల కొద్దీ నెలవారీ సందర్శకుల ఆసక్తి ఆధారంగా జాబితా రూపొందింది.