'పుష్ప-2' లో ఐటమ్ భామ సుకుమార్ కి సవాల్!
'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావా' పాటతో సమంత పాన్ వలర్డ్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు
By: Tupaki Desk | 12 Feb 2024 12:33 PM GMT'ఊ అంటావా మావ..ఊఊ అంటావా మావా' పాటతో సమంత పాన్ వలర్డ్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ ఒక్క పాటతో సమంత రేంజ్ పాన్ ఇండియాకి తాకింది. సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించింది. ఇక 'పుష్ప-2' లోనూ అలాంటి మాస్ నెంబర్ ఒకటి ఉండనే ఉంది. ఇప్పటికే ఆ పాటకి సంబంధించి ట్యూన్ కూడా సెట్ అయింది. చంద్రబోస్ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటని రాసి నట్లు తెలుస్తోంది.
అయితే ఆ పాటలో నటించే నటి ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరం. ఆ పాటలో ఎవరు నటించినా ఓ సంచలనమే అవుతుంది. దీంతో ఐటమ్ భామని ఎంపిక చేయడం అన్నది యూనిట్ కి సవాల్ గానే మారింది. మొత్తం మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆ పాటకి ఐటం భామని ఎంపిక చేయాల్సి ఉంది. టాలీవుడ్ నుంచైతే ఛాన్సేలేదు. బాలీవుడ్ నుంచి ఇప్పటికే కృతిసనన్..దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి.
కానీ అందులో నిజమెంతో తెలియదు. అలాగే యువ నటి సీతర్ కపూర్ పేరు కూడా వినిపించింది. కానీ తనకి అలాంటి అవకాశం రాలేదని సీరత్ ఖండించింది. దీంతో ఇప్పుడీ పాటలో ఏ భామ నర్తిస్తుంది? అన్నది అంతకంతకు ఉత్కంఠ పెరిగిపోతుంది. సుకుమార్ ఏ నటికి ఆ ఛాన్స్ ఇస్తారు? అన్నది మిలి యన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇలాంటి ఎంపికల విషయంలో సుకుమార్ ఒత్తిడికి గురవుతుంటాడు.
అలాంటప్పుడు అవసరంమేర హీరో..సంగీత దర్శకుడి సహకారం తీసుకుంటారు. దేవి శ్రీ ప్రసాద్ అంటే లెక్కలు మాష్టారికి అపారమైన నమ్మకం. మాస్ బీట్ ని కంపోజ్ చేసింది ఆయనే కాబట్టి ఆయన సలహా కూడా ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఎవరో ఒకర్ని సూచిస్తారు. సుకుమార్ మైండ్ లోనూ ఏదో నటి ఉండటనే ఉంటుంది. ఈ మూడు ఆలోచనల్ని ఓ తాటి పైకి తీసుకొచ్చి తుదిగా సుకుమార్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమయం కూడా దగ్గర పడింది. ఆగస్టులో ఎలాగూ రిలీజ్ అని క్లారిటీ వస్తోన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం అతి చేరువలోనే ఉంది.