Begin typing your search above and press return to search.

ఐటెం సాంగ్ కు అంతా రెడీ.. స్టెప్పులేసేదెవరో?

దీంతో సీక్వెల్ లో కూడా ఐటెం సాంగ్ పై డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.

By:  Tupaki Desk   |   15 Jun 2024 8:14 AM GMT
ఐటెం సాంగ్ కు అంతా రెడీ.. స్టెప్పులేసేదెవరో?
X

ఊ అంటావా మామ.. ఊఊ అంటావా మామ.. అంటూ ఎవరినైనా సరే ఉర్రూతలూగించే సత్తా ఉన్న ఈ పాటలో హీరో అల్లు అర్జున్ తో పుష్ప మూవీలో హీరోయిన్ సమంత ఓ రేంజ్ లో సందడి చేసింది. తన డ్యాన్స్, ఎక్స్ప్రెషన్స్ తో నేషనల్ వైడ్ గా అలరించింది. రెండున్నరేళ్ల క్రితం విడుదలైన పుష్ప సినిమా హిట్ కావడంలో ఆ సాంగ్ ముఖ్య పాత్ర పోషించింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే.

దీంతో సీక్వెల్ లో కూడా ఐటెం సాంగ్ పై డైరెక్టర్ సుకుమార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సాంగ్ ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ పాటలో బన్నీతో స్టెప్పులేసేది ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. సమంతనే మళ్లీ అల్లు అర్జున్ తో చిందులేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సామ్ ఆ సాంగ్ చేయడం లేదని క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ బ్యూటీలు దిశా పటానీ, జాన్వీ కపూర్, ఊర్వశి రౌతేలా పేర్లు వినిపించాయి.

రీసెంట్ గా యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చి త్రిప్తి డిమ్రీ ఫిక్స్ అయినట్లు వార్తలు వచ్చాయి. బన్నీతో ఆ బ్యూటీ చిందులేయడం దాదాపు ఖాయమైనట్లేనని కూడా టాక్ వచ్చింది. కానీ ఆమె ఇప్పుడు ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ ను వీలైనంత త్వరగా షూట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ వారంలోనే సాంగ్ లో డ్యాన్స్ చేయనున్న బ్యూటీని ఫిక్స్ చేయనున్నారట.

అయితే ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్ చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ అన్నట్లుగా పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అనేక సార్లు మూవీని అనుకున్న తేదీకే విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆగస్టు 15కి రెడీ అయిపోయారు. కానీ ఇప్పటి వరకు ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు మేకర్స్.

దీంతో సినిమా షూటింగ్ పార్ట్ చాలా పెండింగ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్స్ అయినప్పటికీ.. అనేక నెలలు పడుతుందని చెబుతున్నారు. అందుకే మూవీ డిసెంబర్ కు పోస్ట్ పోన్ అవుతుందని అంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం అనుకున్న తేదీకే సినిమాను తీసుకురావాలని చూస్తున్నారట. అందుకే స్పెషల్ సాంగ్ ను త్వరగా కంప్లీట్ చేయనున్నారని వినికిడి. మరి ఆ పాట కోసం మేకర్స్ ఎవరిని లాక్ చేస్తారో చూడాలి.