Begin typing your search above and press return to search.

పుష్ప 2.. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు తీరేనో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:25 AM GMT
పుష్ప 2.. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు తీరేనో?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మొదటి సినిమా కంటే రెట్టింపు బడ్జెట్ తో ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అలాగే గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం సుకుమార్ చేస్తున్నారు. బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో మూవీపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి.

అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. దీంతో పుష్ప కంటే బెస్ట్ గా పుష్ప 2 ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కారణంగా దర్శకుడు సుకుమార్ పైన ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తోంది. క్లైమాక్స్ విషయంలో ఇంకా సుకుమార్ కన్ఫ్యూజన్ లో ఉన్నారంట. ఇప్పటికే క్లైమాక్స్ సీక్వెన్స్ సిద్ధం చేసుకున్న వాటికంటే ఇంకా బెస్ట్ గా ఏం చేయోచ్చనేది ఆలోచిస్తున్నారంట.

ఈ కారణంగా షూటింగ్ కూడా ఆలస్యం అవుతుందని టాక్. దీంతో ఈ ఎఫెక్ట్ మొత్తం రిలీజ్ మీద పడుతోంది. సంక్రాంతికి రిలీజ్ చేస్తే బజ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నారు. కాని షూటింగ్ నవంబర్ ఆఖరుకి కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందంట. దీంతో సంక్రాంతి నాటికి రిలీజ్ కష్టమని భావిస్తున్నారు. వేసవిలో ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉంది.

ఇలా మూవీ క్లైమాక్స్ తో పాటు సినిమా రిలీజ్ విషయంలో సుకుమార్ కన్ఫ్యూజన్ లో ఉండటంతో ఎప్పుడు ప్రేక్షకుల ముందుకి పుష్ప 2 రానుంది అనేది ఇంకా క్లారిటీ లేదు. మరో వైపు ఈ సినిమా అన్ని భాషలలో రిలీజ్ రైట్స్ కోసం ప్రముఖ డిస్టిబ్యూటర్ ఏకంగా 1000 కోట్ల ఆఫర్ ఇచ్చారనే ప్రచారం తెరపైకి వచ్చింది.

ఓ వైపు సినిమాపై జరుగుతున్న ప్రచారంతో రోజు రోజుకి హైప్ పెరిగిపోతోంది. మరో వైపు షూటింగ్ ఆలస్యం అవుతూ ఉంది. రిలీజ్ పైన స్పష్టత లేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పుష్ప 2 విషయంలో కొంత అసంతృప్తిగా ఉన్నారనే మాట సోషల్ మీడియా సర్కిల్ లో వినిపిస్తోంది.