Begin typing your search above and press return to search.

పుష్ప 2 : ఎంత పెరిగినా పర్వాలేదు!

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో ఇప్పటికే వచ్చిన పుష్ప కి పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయం దక్కిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   23 Nov 2023 6:15 AM GMT
పుష్ప 2 : ఎంత పెరిగినా పర్వాలేదు!
X

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో ఇప్పటికే వచ్చిన పుష్ప కి పాన్‌ ఇండియా రేంజ్ లో భారీ విజయం దక్కిన విషయం తెల్సిందే. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ గా రూపొందుతున్న పుష్ప 2 పై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పుష్ప 2 ఉంటుందని దర్శకుడు సుకుమార్‌ చాలా నమ్మకంగా చెబుతున్నాడు.

పుష్ప సినిమాకు భారీ వసూళ్లు నమోదు కావడంతో పాటు, ఏకంగా జాతీయ అవార్డు రావడం, ఇంకా పలు రికార్డులను నమోదు చేయడం వల్ల పుష్ప 2 ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో వచ్చిన, రాబోతున్న సినిమాల్లో ఇదే అత్యధిక బడ్జెట్‌ సినిమా అన్నట్లుగా మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

పుష్ప 2 సినిమా విషయంలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి సినిమా స్థాయిలో ఖర్చు పెట్టేస్తున్నారు. మరీ అంత బడ్జెట్‌ రికవరీ సాధ్యమేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప అనేది ఒక బ్రాండ్‌. అందుకే ఆ బ్రాండ్ పై ఎంత ఖర్చు పెట్టినా కూడా రెండు మూడు రెట్ల లాభం రావడం ఖాయం. కనుక ఆందోళన అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం.

పుష్ప 2 సినిమా యొక్క బడ్జెట్‌ మొదటి పార్ట్‌ తో పోల్చితే చాలా ఎక్కువ. అయితే ఇప్పుడు మొదటి పార్ట్‌ తో పోల్చితే ఇప్పుడు పుష్ప 2 పై ఉన్న బజ్ ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకే ఎంత బడ్జెట్‌ పెట్టినా ఇబ్బంది లేదు అనేది సినీ వర్గాల అభిప్రాయం. కనుక మైత్రి మూవీ మేకర్స్ వారు రికార్డు స్థాయిలో ఖర్చు చేస్తున్నారు.

అయినా దర్శకుడు సుకుమార్‌ తాను పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం చేస్తాడు.. దాన్ని సినిమాలో చూపిస్తాడు. కనుక ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గ్రాండ్ గా, అద్భుతంగా సినిమా ఉంటుంది అంటూ ఆయన అభిమానులు మరియు సన్నిహితులు నమ్ముతున్నారు.

సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల అవ్వబోతుంది. ఇప్పుడు విమర్శిస్తున్న వారు, బడ్జెట్‌ ఎక్కువ అయిందని అన్న వారు అంతా కూడా అప్పుడు ప్రశంసలు కురిపించడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.