Begin typing your search above and press return to search.

పుష్ప2 బిజినెస్.. ఆ రేంజ్ లో సాధ్యమేనా?

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఏకంగా 300 కోట్ల వరకు మైత్రీ మూవీ మేకర్స్ వారు బడ్జెట్ పెడుతున్నారు

By:  Tupaki Desk   |   31 Dec 2023 5:25 AM GMT
పుష్ప2 బిజినెస్.. ఆ రేంజ్ లో సాధ్యమేనా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పుష్ప 2. పుష్పకి సీక్వెల్ గా సిద్ధం అవుతోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా బజ్ ఉన్న ఐకాన్ స్టార్ అన్ని సినిమాల తరహాలోనే దీనిపైన కూడా హైప్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఏకంగా 300 కోట్ల వరకు మైత్రీ మూవీ మేకర్స్ వారు బడ్జెట్ పెడుతున్నారు. నాన్ థీయాట్రికల్ రైట్స్ కాకుండా ఈ సినిమాపై 200 కోట్ల బిజినెస్ ని నిర్మాతలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. సినిమాకి ఉన్న బజ్ కారణంగా ఆ స్థాయిలో కచ్చితంగా బిజినెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే రియాలిటీలో పరిస్థితి వేరుగా ఉంది.

డిస్టిబ్యూటర్స్ ఈ మధ్యకాలంలో సినిమాలు మార్కెట్ లెక్కలు చూసుకొని కొంటున్నారు. పెద్ద సినిమాలకి ప్రేక్షకాదరణ ఎలా ఉంటుంది. ఎన్ని రోజులు సినిమా థియేటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ తో నడుస్తోంది. ఆడియన్స్ ఎలాంటి సినిమాలు ఎక్కువగా థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడుతున్నారు వంటి విషయాలు పరిగణంలోకి తీసుకుంటున్నారు. ఈ లెక్కలన్నీ చూసుకున్న తర్వాత 160 కోట్ల వరకు పుష్ప 2పై బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

సంక్రాంతి సీజన్ తప్ప ఇంకెప్పుడు వచ్చిన సినిమాలు ఎక్కువ రోజులు ప్రేక్షకులని థియేటర్స్ కి వచ్చేలా చేయలేకపోతున్నాయి. ఒక్క రాజమౌళి సినిమాలకి తప్ప వేరే ఏ మూవీస్ కి ఒక్క తెలుగులో తప్ప సౌత్ లో ఇతర భాషలలో పెద్దగా ఆదరణ ఉండటం లేదు. నార్త్ ఇండియాలో సైతం లెక్కలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో 60 కోట్లు బిజినెస్ కూడా ఎక్కువ అని సలార్ మూవీ ప్రూవ్ చేస్తోంది. ఈ సినిమాకి ఏపీలో ఇంకా బ్రేక్ ఈవెన్ రాలేదు.

70 కోట్లకి పైగా బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 50 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సలార్ లాంటి సినిమాకే ఏపీలో బ్రేక్ ఈవెన్ రాలేదంటే అంతకంటే తక్కువ బజ్ ఫ్యాన్ బేస్ ఉన్న పుష్ప 60 కోట్ల షేర్ కూడా ఏపీలో కలెక్ట్ చేయడం కష్టం అని భావిస్తున్నారు. కాని మైత్రీ నిర్మాతలు మాత్రం 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యేది కాదని ట్రేడ్ పండితుల అంచనా. అలాగే నైజాంలో కూడా 70 నుంచి 75 కోట్ల బిజినెస్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ స్థాయిలో జరిగే అవకాశం ఉందా అనేది సందేహమే.