Begin typing your search above and press return to search.

పుష్ప 2: అది నిజమే.. బన్నీ వాసు ఏమన్నారంటే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ గత మూడేళ్ళ నుంచి జరుగుతోంది.

By:  Tupaki Desk   |   5 Aug 2024 8:15 AM GMT
పుష్ప 2: అది నిజమే.. బన్నీ వాసు ఏమన్నారంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ గత మూడేళ్ళ నుంచి జరుగుతోంది. ఇప్పటికి కూడా షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి రాలేదు. పుష్ప మూవీ సక్సెస్ కావడంతో దానికి సీక్వెల్ గా సిద్ధమవుతోన్న పుష్ప ది రూల్ మూవీ పైన డైరెక్టర్ సుకుమార్ చాలా ఎక్కువ ఫోకస్ చేశారు. కథలో కూడా చాలా మార్పులు చేశారని టాక్ వచ్చింది. ముందు అనుకున్న స్టోరీని యూనివర్సల్ ఆడియన్స్ కి రీచ్ చేయాలనే ఉద్దేశ్యంతో మరింత బెటర్ చేసారని కూడా కథనాలు వెలువడ్డాయి.

హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఆగష్టు 15న పుష్ప ది రూల్ మూవీ నిజానికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ డేట్ ని డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ప్రస్తుతానికి అయితే అదే డేట్ కి రావాలనే టార్గెట్ తో చిత్ర యూనిట్ పనిచేస్తోంది. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో రకరకాల రూమర్స్ తెరపైకి వస్తున్నాయి.

వీటన్నింటికి అల్లు అర్జున్ సన్నిహితులు, సినిమాకి వర్క్ చేస్తున్నవారు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బన్నీ వాస్ పుష్ప ది రూల్ మూవీ ఆలస్యం కావడానికి గల రీజన్ ని మీడియాతో పంచుకున్నారు. ఆయ్ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పుష్ప 2 గురించి బన్నీ వాస్ చెప్పారు. పుష్ప 2 కథలో సుకుమార్ గారు చాలా మార్పులు చేశారు. ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా యాడ్ చేశారు. పుష్ప సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ని మరింత బెస్ట్ గా చేయాలని సుకుమార్ అనుకున్నారు.

అందుకే పుష్ప 2 స్క్రిప్ట్ లో మార్పులు ఎక్కువగా చేయాల్సి వచ్చిందని బన్నీ వాస్ తెలిపారు. ప్రేక్షకులకి కొత్త అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే సుకుమార్ వర్క్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ ఆలస్యం బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కొంత ఎఫెక్ట్ పడిన మాట వాస్తవమేనని బన్నీ వాస్ తెలిపారు. అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ కి సంబందించిన ఎనౌన్స్ మెంట్ ఈ నెలలోనే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు..

పుష్ప 2 మూవీ ఎడిటింగ్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందని. సినిమాలో లోటుపాట్లు చూసుకొని మళ్ళీ సుకుమార్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. కచ్చితంగా పుష్ప 2 మూవీ ఫ్యాన్స్ అందరూ గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుందని బన్నీ వాస్ ఒక వివరణ ఇవ్వడంతో ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ప్రస్తుతం మేకర్స్ క్లైమాక్స్ సీన్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్ చేస్తున్నారు.