Begin typing your search above and press return to search.

పుష్ప-2.. ఇప్పుడు మరో సమస్య?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 July 2024 8:10 AM GMT
పుష్ప-2.. ఇప్పుడు మరో సమస్య?
X

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ తో చాలా జాగ్రత్తగా, ఒకటికి రెండు సార్లు చూసుకుని సుకుమార్ షూటింగ్ జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్సెస్, సాంగ్స్ అదిరిపోయే బజ్ ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా అంతా వెయిట్ చేస్తున్నారు

ఇక ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామని అనేక సార్లు ప్రకటించిన మేకర్స్.. షూటింగ్ చాలా పార్ట్ పెండింగ్ ఉండిపోవడంతో విడుదలను వాయిదా వేశారు. డిసెంబర్ 6వ తేదీన తీసుకొస్తామని ప్రకటించారు. కానీ అది కూడా కష్టమేనని రీసెంట్ గా ప్రచారం సాగింది. బన్నీ, సుకుమార్ మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే గడ్డం ట్రిమ్ చేసి అల్లు అర్జున్ ఫారిన్ ట్రిప్ కు వెళ్లారని టాక్ వినిపించింది. అయితే విబేధాలు లేవని బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు.

షూటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, జస్ట్ చిన్న బ్రేక్ వచ్చిందని అల్లు అర్జున్ టీమ్ తెలిపింది. అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ అవుతుందని, అతి త్వరలో షూటింగ్ మొదలవుతుందని చెప్పింది. బన్నీ పార్ట్ చాలా తక్కువగా ఉందని.. కొత్త షెడ్యూల్ లో మిగతా నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అది కూడా భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర పోషిస్తున్న ఫహాద్ ఫాజిల్ పై ఎక్కువ సీన్స్ తీయాల్సి ఉందని సమాచారం.

అయితే ప్రస్తుతం మాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఫహాద్ ఫాజిల్.. కొన్ని నెలల క్రితం పుష్ప-2కు డబుల్ కాల్ షీట్స్ ఇచ్చారని టాక్ వినిపించింది. కానీ వాటిని సుక్కూ వేస్ట్ చేశారని తెలుస్తోంది. కొన్ని రోజులు షూట్ ను క్యాన్సిల్ చేయడం.. మరికొన్ని రోజులు సీన్స్ ను రీషూట్ చేయడం.. అలా టైమ్ వేస్ట్ చేశారట. దీంతో ఫహాద్ ఫీల్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ డేట్స్ ఇవ్వడానికి ఆయన ముందుకు రావడం లేదట.

పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్స్ ను మేకర్స్.. అలా పొడిగించడం వల్ల ఫహాద్ చాలా ఫ్రస్టేట్ అవుతున్నారని జోరుగా చర్చ సాగుతోంది. ఓ వైపు చేతి నిండా సినిమాలు ఉంటే.. మరోవైపు పుష్ప-2 టీమ్ మళ్లీ మళ్లీ డేట్స్ అడుగుతుండడంతో ఆయన చిరాకు పడుతున్నారట. ఇంకా కొత్త షెడ్యూల్ కు డేట్స్ ఇవ్వలేదని టాక్. ఇప్పుడు మేకర్స్ కు ఇదే పెద్ద ఛాలెంజ్ గా మారిందని వినికిడి. ఇంకా బన్నీ, ఫహాద్ మధ్య క్లైమాక్స్ కూడా పెండింగ్ ఉందని సమాచారం. మరేం జరుగుతుందో చూడాలి.