పుష్ప-3..ఇది RRR లెక్క!
`పుష్ప` ది రైజ్` ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే.
By: Tupaki Desk | 8 Feb 2024 7:02 AM GMT`పుష్ప` ది రైజ్` ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియాలో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. ముఖ్యంగా హిందీ మార్కెట్ లో పుష్ప హవా ఓ రేంజ్లో కొనసాగింది. దీంతో `పుష్ప-2` ది రూల్` ని నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. చెప్పినట్లు గానే ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్వవం సందర్భంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో` పుష్ప` శకం ముగిసినట్లే అవుతుందని అంతా అనుకున్నారు.
ఆ తర్వాత బన్నీ-సుకుమార్ వేర్వేరు ప్రాజెక్ట్ ల్లో భాగమవుతారని భావిస్తున్నారు. కానీ పుష్ప కథకి ఇప్పట్లో ఎండింగ్ లేదని తాజాగా లీకులందుతున్నాయి. `పుష్ప-2` కి కొనసాగింపుగా `పుష్ప-3` కూడా ఉంటుందని తాజాగా వెలుగులోకి వస్తోంది. ఇది ట్రిపుల్ ఆర్ లెక్క అని ఇన్ సైడ్ జోరుగా చర్చ సాగుతుంది. `ది రైజ్`..ది రూల్` తర్వా త `ది రన్` తెరపైకి రానుందని అంటున్నారు. అదీ `పుష్ప-2` రిలీజ్ అయిన వెంటనే ఉంటుందని గుస గుస వినిపిస్తుంది. అయితే పుష్ప-3 రావాలి అంటే? పుష్ప-2 ఫలితం పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
మొదటి భాగం 370 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. దీంతో రెండవ భాగాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తు న్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుగుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద `పుష్ప-2` టార్గెట్ 1500 కోట్ల వరకూ ఉంటుందని ఓ అంచనా. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్ లిస్ట్ లో ఉంది. సలార్ -2 తో పాటు పుష్ప-2 టైటిల్ కూడా గట్టిగానే వినిపిస్తుంది.
మరి పుష్ప కొనసాగింపు కథ మాటేంటి? అటే పుష్ప కథ ఓ వెబ్ సిరీస్ అంత స్పాన్ ఉందని సుకుమార్ తొలి భాగం సమయంలోనే రివీల్ చేసాడు. బిగ్ స్పాన్ ఉన్న స్టోరీ కావడంతో ఎపిసోడ్లగా తీయాలని అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇది సినిమా గా రూపాంతరం చెందింది. కాబట్టి ఈ ప్రాంచైజీని సుకు మార్ అంత ఈజీగా వదలడు. సక్సెస్ అయితే కొనసాగింపు ఉంటుందని అంచనాలు తెరపైకి వస్తున్నాయి.