Begin typing your search above and press return to search.

1000 కోట్ల టార్గెట్.. ఇలా అయితే కష్టం పుష్ప?

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పుష్ప-2' ఒకటి.

By:  Tupaki Desk   |   17 Jun 2024 7:38 AM GMT
1000 కోట్ల టార్గెట్.. ఇలా అయితే కష్టం పుష్ప?
X

ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పుష్ప-2' ఒకటి. ఈ సినిమాతో బాక్సాఫీస్ మార్కెట్ వద్ద 1000 కోట్ల మార్క్ ను అందుకోవాలి అని హీరోతో పాటు దర్శకుడు నిర్మాతలు చాలా బలంగా వర్క్ మొదలు పెట్టారు. పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే అంత పెద్ద టార్గెట్ అందుకోవాలి అంటే దానికి తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ విడుదల కూడా ఉండాలి.

కానీ వీరి ప్లాన్ చూస్తుంటే అసలు ఆ టార్గెట్ కు తగ్గట్టుగా వెళ్లడం లేదు అనిపిస్తుంది. ఆగస్టు 15న విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం వాయిదా పడనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈ నిర్ణయానికి సుకుమార్ అండ్ టీం, హీరో అల్లు అర్జున్‌తో సమాలోచనలు జరిపి వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను అనుకున్న తేదీకి విడుదల చేయాలని నిర్మాతలు చాలా ప్రయత్నాలు చేశారు.

అయితే సుకుమార్ తన టీంతో కలిసి నిర్ణయించుకున్న వాయిదాను మార్చలేకపోయారు. ఆగస్టు 15ను విడుదల తేదీని టార్గెట్ గా పెట్టుకొని షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సక్రమంగా పూర్తి చేయడం చాలా కష్టమని భావించి వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ వాయిదా నిర్ణయం నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారింది.

బిజినెస్ డీల్స్, అడ్వాన్సులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లతో సమస్యలు తలెత్తకుండా ఉండవు. వాయిదా కారణంగా వడ్డీల నష్టం భరించాల్సి ఉంటుంది. అంతేకాక, డిజిటల్ హక్కుల ఒప్పందాలను కూడా రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రివైజన్ వల్ల కొంత ఆదాయంలో కోత పడే అవకాశం ఉంది. అందుకే నిర్మాతలు విడుదల విషయంలో అంత ఈజీగా నిర్ణయాన్ని మార్చుకోరు. కానీ పుష్ప 2 విషయంలో ఎలా చూసినా పరిస్థితులు అనుకూలించడం లేదు.

ఇక అదనపు వర్కింగ్ డేస్ కోసం పెట్టే ఖర్చు, ఫైనాన్స్ వడ్డీలు కూడా పెరుగుతాయి. ఆగస్టు 15 లాంటి సూపర్ డేట్‌ను కోల్పోవడం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది. క్రిస్మస్ లేదా మరో డేట్ చూసుకోవాల్సి వస్తే, అది ఇప్పుడున్నంత అనుకూలంగా ఉండకపోవచ్చు. పోటీ కూడా తలెత్తే అవకాశం ఉంది. వాయిదా వల్ల సినిమా బజ్ మీద కూడా ప్రభావం పడే అవకాశముంది.

వాయిదా నిర్ణయం పుష్ప-2 బిజినెస్ లెక్కలన్నీటిని తారుమారు చేస్తోంది. ఓవరాల్ రేట్లలో రిబేట్ ఇవ్వాల్సి రావడం, ఫైనాన్స్ వడ్డీలు పెరగడం, అదనపు వర్కింగ్ డేస్ ఖర్చు వంటి సమస్యలు నిర్మాతలపై భారంగా మారాయి. ఇప్పటికీ, పుష్ప-2 క్రియేట్ చేసిన బజ్ తగ్గకుండా ఉండాలంటే, ప్రమోషన్లు ముమ్మరం చేయడం, కొత్త విడుదల తేదీకి తగ్గట్టుగా పాన్ చేసుకోవడం అవసరం. క్రిస్మస్ లేదా మరో డేట్ చూసుకోవడం వల్ల కలిగే సవాళ్లు అధిగమించడానికి సుకుమార్ అండ్ టీం, నిర్మాతలకు ఇబ్బంది రాకుండా అడుగులు వేస్తే బెటర్.