Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ తో సుకుమార్ కి తేడాలొచ్చాయా..?

అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరిది ఇప్పటి రిలేషన్ కాదు.. ఆర్య సినిమా టైం నుంచి ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:40 AM GMT
పుష్ప రాజ్ తో సుకుమార్ కి తేడాలొచ్చాయా..?
X

పుష్ప 2 రిలీజ్ విషయంలో అల్లు ఫ్యాన్స్ అంతా కన్ ఫ్యూజన్ గా ఉన్నారు. పుష్ప 2 సినిమాను అసలైతే ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా అనుకున్న టైం కి సినిమా పూర్తి చేయలేని కారణంగా సినిమా రిలీజ్ వాయిదా వేయాలని అనుకున్నారు. సినిమా పోస్ట్ పోన్ మ్యాటర్ లో డైరెక్టర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య తేడాలొచ్చాయని టాక్.

అల్లు అర్జున్ సుకుమార్ ఇద్దరిది ఇప్పటి రిలేషన్ కాదు.. ఆర్య సినిమా టైం నుంచి ఇద్దరు ఎంతో క్లోజ్ గా ఉంటున్నారు. ఈమధ్యనే ఆర్య 20 ఇయర్స్ సందర్భంగా ఆర్య లేకపోతే తన కెరీర్ ఎలా ఉండేదో అని అల్లు అర్జున్ చెప్పగా.. ఆర్య ఛాన్స్ ఇవ్వకపోతే కెరీర్ ఎలా ఉండేదో అని సుక్కు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఐతే ఇద్దరు అంత మంచి రిలేషన్ ఉన్నా కూడా పుష్ప 2 పూర్తి చేయడానికి ఇంకా కాస్త టైం కావాలని నిర్మాతలతో చెప్పిన సుకుమార్ అల్లు అర్జున్ కి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడట.

అల్లు అర్జున్ కూడా సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు 15న రిలీజ్ చేయాలని నిర్మాతలతో చెబుతున్నాడట కానీ సుకుమార్ ని మాత్రం ఏమి అనట్లేదట. ఇలా దర్శకుడు, హీరో మధ్యలో నిర్మతలు ఇద్దరికి సమాధానం చెప్పలేకపోతున్నారని టాక్. అంతేకాదు ఈమధ్య అల్లు అర్జున్ చేసిన ఒక విషయం మీద మెగా ఫ్యాన్స్ అంతా కూడా ఫైర్ మీద ఉన్నారు. ఈ టైం లో సినిమా రిలీజ్ చేయడం కన్నా వాయిదా వేసి పరిస్థితి చక్కబడ్డాక వదలాలని చూస్తున్నారు.

సుకుమార్, అల్లు అర్జున్ మధ్య నిజంగానే గ్యాప్ వచ్చిందా.. పుష్ప 1 తో సూపర్ హిట్ కొట్టిన ఈ కాంబో పుష్ప 2 రిలీజ్ విషయంలో తేడాలు వస్తున్నాయా.. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే. పుష్ప 2 ఆగష్టు 15న వాయిదా పడితే డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆగష్టు 15న పుష్ప రావడం లేదని కన్ఫర్మ్ అయితే మరికొన్ని సినిమాలు ఆ డేట్ న రావాలని చూస్తున్నాయి. ఇప్పటికే రాం పూరీ కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఆ డేట్ ని ఆక్యుపై చేయగా మరో రెండు సినిమాలు ఆరోజు రావాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.