Begin typing your search above and press return to search.

సుకుమార్ మీద ఫ్యాన్స్ అలక..!

పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్న సుకుమార్ డైరెక్టర్ గా ఒక మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   15 July 2024 5:08 AM GMT
సుకుమార్ మీద ఫ్యాన్స్ అలక..!
X

పుష్ప 1 తో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ అందుకున్న సుకుమార్ డైరెక్టర్ గా ఒక మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. రాజమౌళి భారీ సెట్టులతో.. భారీ బడ్జెట్ తో.. ఏళ్లకు ఏళ్లు సినిమాలు తీస్తుంటే సుకుమార్ తను అనుకున్న కథతో అంతకన్నా తక్కువ బడ్జెట్ తో అదే ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. తన మొదటి సినిమా ఆర్య నుంచి హీరో పాత్రని డిఫరెంట్ గా చూపించడానికి ప్రయత్నించే సుకుమార్ పుష్ప రాజ్ పాత్రని ప్రతి ఒక్క ఆడియన్ కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది.

ఇక ఆ సినిమా సెకండ్ పార్ట్ గా పుష్ప 2 వస్తుంది. ఈ సినిమాలో కూడా పుష్ప రాజ్ విశ్వరూపం తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయని అంటున్నారు. ఐతే పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ మీద అల్లు ఫ్యాన్స్ కాస్త అలక మీద ఉన్నారు. ఎందుకు అంటే.. ఆగష్టు 15న ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తామని చెప్పి సడెన్ గా డిసెంబర్ 6కి వాయిదా వేశారు. ఆగష్టులో పుష్ప రాజ్ మేనియా ఉండబోతుందని ఆశించిన ఫ్యాన్స్ కి షాక్ తగిలినట్టు అయ్యింది.

ఐతే పుష్ప 2 డిసెంబర్ కి వస్తుంది ఈలోగా సినిమాపై అంచనాలు పెంచేలా ఏమైనా ప్రమోషన్స్ చేస్తారా అంటే అది కూడా చేయట్లేదు. పుష్ప 1 ఎలాగు హిట్ అయ్యింది భారీ ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా పుష్ప 2 మీద ఇంపాక్ట్ పడదని సుకుమార్ అనుకుంటున్నాడు. ఐతే ప్రమోషన్స్ ఏమో కానీ కానీసం సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని ఇవ్వడం కూడా మానేశారు.

చివరగా రిలీజ్ డేట్ మారిన పోస్టర్ వేశారు కానీ పుష్ప 2 అప్డేట్ ఇవ్వలేదు. పుష్ప 2 నుంచి ఇప్పటివరకు 2 పాటలు రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ టైం లో పుష్ప అప్డేట్స్ లేదా ఏదైనా గ్లింప్స్ వదిలితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐతే ఈమధ్య స్టార్ సినిమాల మీద ఉన్న అంచనాలతో సినిమా గురించి ఎంత ప్రమోట్ చేస్తున్నా ఇది సరిపోలేదు ఇంకా కావాలని అంటున్నారు.

అందుకే కల్కి సినిమా రిలీజ్ ముందు నాగ్ అశ్విన్ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. ఆ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి అది కూడా ఒక రీజన్ అంటున్నారు. సినిమా గురించి ఎక్కువ చెప్పి ఆడియన్స్ చూడటానికి లేకుండా చేయడం కన్నా రిలీజ్ ముందు ఫ్యాన్స్ తిట్టుకున్నా పర్లేదు. బ్లాక్ బస్టర్ బొమ్మ ఇస్తే చాలు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అర్థం చేసుకుంటారు. కల్కి లానే సుకుమార్ కూడా సినిమా గురించి ఎక్కువ లీక్స్ లేకుండా చేయడానికే పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదని అంటున్నారు. డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేసుకున్న పుష్ప 2 గురించి సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.