Begin typing your search above and press return to search.

పుష్ప 2.. గ్యాప్ ఇవ్వకుండానే..

పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం వెనుక ఇప్పటికే రకరకాలుగా కథనాలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2024 10:30 AM GMT
పుష్ప 2.. గ్యాప్ ఇవ్వకుండానే..
X

పుష్ప 2 సినిమా షూటింగ్ ఆలస్యం వెనుక ఇప్పటికే రకరకాలుగా కథనాలు వచ్చాయి. మంచి అవుట్ పూట్ అందించేందుకు కష్టపడుతున్నట్లు ఇదివరకే మైత్రి మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆగస్టు 15కి రావాల్సిన సినిమా ఒక్కసారిగా డిసెంబర్ 6 కు షిఫ్ట్ అయ్యింది. ఏదేమైనా ప్రస్తుతం షూటింగ్ అయితే ట్రాక్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ‘పుష్ప 2’ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించేందుకు అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా తలమునకలై ఉన్నారు. దర్శకుడు సుకుమార్‌తో అల్లు అర్జున్‌కి కొన్ని అనుభవిక విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్నా, అలాంటివి వదిలేసి షూటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదట, ఈ తాజా షెడ్యూల్ ఒక వారం మాత్రమే ఉంటుందని, తరువాత అల్లు అర్జున్ విరామం తీసుకుంటాడని అందరూ భావించారు.

అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అల్లు అర్జున్ యూనిట్‌కి అందుబాటులో ఉండి సినిమాకు సంబంధించిన పనులను వేగంగా ముగించడానికి కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రారంభమైనప్పటి నుండి అల్లు అర్జున్ క్షణం కూడా గడపకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

మొదటి భాగంతోనే అభిమానులను ఆకట్టుకున్న ‘పుష్ప’, ఈ రెండవ భాగంతో మరింత మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతుంది. ‘పుష్ప 2’ చిత్రంను డిసెంబర్ లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, తాజాగా బాలీవుడ్ మీడియా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ చిత్రం 2025 ఏప్రిల్‌కు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ, ఈ వార్తలు అధికారికంగా నిర్ధారణ కాలేదు.

సినిమా పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయాలని యూనిట్ హార్డ్ వర్క్ వహిస్తోంది. ఇక బన్నీ కూడా పెద్దగా బ్రేక్ తీసుకోవడం లేదు. అలాగే గతంలో జరిగిన పొరపాటు ఈసారి అస్సలు జరగకూడదని అనుకుంటున్నారు. పుష్ప 1 సమయంలో మేకర్స్ పెద్దగా ప్రమోషన్ లో పాల్గొనలేదు. ముఖ్యంగా సుకుమార్ ఎడిటింగ్ రూమ్ కే పరిమితం అయ్యారు. విడుదల ముందు రోజు వరకు ఫైనల్ కాపీ విషయంలో ఎడిటింగ్ చేస్తూనే ఉండిపోయారు.

అయితే పుష్ప 2 విషయంలో అలాంటి అవాంతరాలు లేకుండా పని సాగుతోంది. సినిమా విడుదలకు ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ విశ్వసిస్తున్నారు. సినిమా అన్ని పనులను నవంబర్ మొదటి వారానికి ఫినిష్ చేసి ఆ తరువాత నెల రోజులు ప్రమోషన్స్ పై ఫోకస్ చేయనున్నారట. ఇక రిలీజ్ డేట్ విషయంలో మరోసారి అఫీషియల్ క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.