Begin typing your search above and press return to search.

మూగబోయిన 'పుష్ప 2' టీజర్..!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘పుష్ప:ది రూల్’ టీజర్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది

By:  Tupaki Desk   |   9 April 2024 4:17 AM GMT
మూగబోయిన పుష్ప 2 టీజర్..!
X

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘పుష్ప:ది రూల్’ టీజర్‌ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. యూట్యూబ్ లో 13 గంటల్లోనే 51+ మిలియన్ల రియల్ టైమ్ వ్యూస్ తో, 1 మిలియన్ కు పైగా లైక్స్ తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి సైతం టీజర్‌ అద్భుతంగా ఉందని, పుష్పరాజ్‌ రూల్‌ చేస్తాడని కొనియాడారు. అయితే ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ తో నిరాశ చెందుతున్నారని తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ మూవీ "పుష్ప 2". ఇది బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'పుష్ప: ది రైజ్' చిత్రానికి రెండో భాగం. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సుకుమార్ రైటింగ్స్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సోమవారం టీజర్ ను లాంచ్ చేసారు మేకర్స్.

'వేర్ ఈజ్ పుష్ప?' అంటూ 3.14 నిమిషాలతో ఫస్ట్ గ్లింప్స్ వదిలిన సుకుమార్ టీమ్.. ఇప్పుడు 'పుష్ప 2' టీజర్ ను మాత్రం కేవలం 1 నిమిషం 6 సెకెండ్ల నిడివితో కట్ చేశారు. సినిమాలో కీలకమైన జారత సీన్ నే ఇందులో హైలైట్ చేసి చూపించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ ద్వారా అందరికీ పరిచయం చేసిన లేడీ గెటప్ లో అల్లు అర్జున్ నే మరోసారి వీడియో రూపంలో ప్రెజెంట్ చేశారు. దీనికి అదనంగా యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించారు.

గంగమ్మ జాతర ఉత్సవాలలో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు. చీర కట్టుకొని, మెడలో నిమ్మకాయల దండ, పూల మాల వేసుకొని.. కాళ్లకి గజ్జెలు, చెవులకు ఝుంకాలు ధరించి.. ముక్కుకి ముక్కెర, కళ్లకి కాటుక పెట్టుకొని.. ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని పుష్పరాజ్ పవర్‌ ఫుల్‌ లుక్ లో దర్శనమిచ్చారు. ఇక రౌడీలను చితక్కొడుతూ చీర కొంగును కాలితో చేతికి తీసుకొని, నడుమున దోపే షాట్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. 'పుష్ప 2' టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడంపై ఐకాన్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. ఎంతో కలర్ ఫుల్ గా సాగిన ఈ వీడియోలో ఒక్క డైలాగ్ పడకపోవడం డిస్సపాయింట్ చేసిందని అంటున్నారు. ఒక మంచి క్యాచీ డైలాగ్ పడుంటే అసలైన మాస్ జాతర మొదలయ్యేదని, బన్నీ బర్త్ డే మరింత స్పెషల్ గా మారేదని కామెంట్లు చేస్తున్నారు.

టీజర్ లో పుష్పరాజ్ ట్రేడ్‌ మార్క్ స్వాగ్ ను చూపించినట్లే.. 'తగ్గేదేలే' అనే డైలాగ్ ను రిపీట్ చేసినా బాగుండేదని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. మరి సుక్కు ఇలా ఎందుకు ఆలోచించలేదో అని ప్రశ్నిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం కూడా ఇంకా బెటర్ గా ఉండాల్సిందని అంటున్నారు. రాబోయే ప్రమోషనల్ మెటీరియల్ తోనైనా ఫుల్ మీల్స్ పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.