Begin typing your search above and press return to search.

ఇక అన్నీ స్టేట్లు నీవే పుష్ప!

కచ్చితంగా ఈ మూవీ నార్త్ ఇండియాతో పాటు సౌత్ లో కూడా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:07 AM GMT
ఇక అన్నీ స్టేట్లు నీవే పుష్ప!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప ది రూల్. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే పుష్ప ది రూల్ రాక కోసం బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

పుష్ప మూవీ నార్త్ ఇండియాలో 100 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. దీంతో పుష్ప ది రూల్ కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రీసెంట్ గా పుష్ప 2 టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ లో అమ్మవారి గెటప్ వేసుకొని ఉన్న అల్లు అర్జున్ లుక్ తో ఈ టీజర్ ని వదిలారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

దీనిని బట్టి సినిమా పట్ల ఫ్యాన్స్ ఎంతగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆగష్టు 15న పుష్ప ది రూల్ చిత్రాన్ని గ్రాండ్ గా ఐదు భాషలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇండియన్ 2 మూవీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయ్యింది. అలాగే విజయ్ GOAT సినిమా కూడా ఉంటుందని టాక్ నడిచింది.

ఇండియన్ 2 మూవీ డేట్ మార్చేసినట్లు తెలుస్తోంది. ఇక దళపతి GOAT చిత్రం కూడా దీపావళికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందంట. ఇంకా ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. అందుకే ఆగష్టులో రిలీజ్ కష్టం అని దీపావళికి ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే రిలీజ్ కాబోతున్నాయి. ఒక వేళ ఆగష్టు 15కి ఇవి రిలీజ్ అయ్యి ఉంటే టఫ్ ఫైట్ నడిచేది. కానీ ఆగష్టు 15 రేసు నుంచి ఈ రెండు సినిమాలు తప్పుకోవడంతో ఇప్పుడు పుష్ప ది రూల్ మూవీకి సోలో రిలీజ్ దొరికింది. మలయాళం, కన్నడలో పుష్పకు పెద్దగా పోటీ లేదు.

తమిళంలో హిందీలో అలాగే తెలుగులో పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడంతో పుష్ప 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సాధించడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. కచ్చితంగా ఈ మూవీ నార్త్ ఇండియాతో పాటు సౌత్ లో కూడా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ సినిమా పట్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఎక్స్ పెక్టేషన్స్, అలాగే ఐకాన్ స్టార్ క్రేజ్ వల్ల భారీ ఓపెనింగ్స్ కి రావడం గ్యారెంటీ అని చెబుతున్నారు.