Begin typing your search above and press return to search.

సుక్కు.. ఈసారి అలాంటి మిస్టేక్ చేయకుంటే బెటర్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Feb 2024 5:30 AM GMT
సుక్కు.. ఈసారి అలాంటి మిస్టేక్ చేయకుంటే బెటర్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ డేట్ అయితే మారే అవకాశం లేదని తెలుస్తోంది. పుష్పకి సీక్వెల్ గా పాన్ ఇండియా రేంజ్ లో రాబోయే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.

పుష్ప మూవీ తెలుగులో కంటే హిందీలో ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఆ సినిమాలో సాంగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. పుష్ప 2 నుంచి కూడా ఆడియన్స్ అదే రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పుష్ప సినిమా ప్రమోషన్స్ సమయంలో డైరెక్టర్ సుకుమార్ పెద్దగా కనిపించలేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పైన ఫోకస్ చేశాడు. ఓవర్ నైట్ వర్క్ చేసి మరీ పుష్ప బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు.

అందుకే ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాత్రమే సుకుమార్ కనిపించాడు. మరల పుష్ప 2 మూవీకి కూడా సుకుమార్ అలాగే చేస్తాడా అంటే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కి కావాల్సినంత సమయం అయితే ఉంది. అలాగే పుష్ప 2 షూటింగ్ కూడా పెర్ఫెక్షన్ కోసం చాలా కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. బెస్ట్ అవుట్ ఫుట్ ఇవ్వడం కోసం సుకుమార్ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు.

అయితే మూవీ ఎడిటింగ్ రూమ్ లో రిలీజ్ కి ముందు రోజు వరకు సుకుమార్ వర్క్ చేస్తూనే ఉంటారంట. మరింత బెటర్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారంట. పుష్ప 2 ప్రమోషన్స్ కి అయితే సుకుమార్ అందుబాటులో ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎలాగూ దేశ వ్యాప్తంగా తిరిగి సినిమాని ప్రమోట్ చేస్తారు.

అదే సమయంలో సుకుమార్ కూడా ఉంటే మూవీకి అదనపు అస్సెట్ అవుతుందని భావిస్తున్నారు. పుష్ప సినిమా ప్రమోషన్స్ కి చేసినట్లుగానే పుష్ప 2కి కూడా సుకుమార్ ఎడిటింగ్ రూమ్ కి పరిమితమైపోయి ఉంటాడేమో అనే టాక్ వినిపిస్తోంది. ఎలాగూ టైం ఉంది కాబట్టి వీలైనంత వేగంగా అవుట్ ఫుట్ సిద్ధం చేసుకొని టీం మొత్తం ప్రమోషన్స్ లో పాల్గొంటే బెటర్ అని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు.