పుష్ప 2 రిలీజ్ డేట్... ఏమవుతుందో?
తాజా వార్తల ప్రకారం మూవీ మార్చిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. ఎందుకంటే, ఈ మూవీ ఇప్పటి వరకు షూటింగ్ కనీసం 30శాతం కూడా పూర్తికాలేదట.
By: Tupaki Desk | 30 Aug 2023 1:41 PM GMTఅల్లు అర్జున్ పుష్ప మూవీతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు. ఎప్పుడూ స్టైలిష్ లుక్ లో కనిపించే ఆయన, ఈ మూవీలో రఫ్ లుక్ లోనూ అందులోనూ గూని ఉన్న వ్యక్తిగా నటించి మెస్మైరైజ్ చేశారు. పాటల్లోనూ అదే మేనరిజం కంటిన్యూ చేశారు. అల్లు అర్జున్ డైలాగులు చెప్పిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా పుష్ప కి జై కొట్టారు. ఇప్పటికీ, ఈ మూవీ క్రేజ్ తగ్గలేదనే చెప్పాలి.
ఈ మూవీలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డు ఒక్కటి చాలు ఈ సినిమా గురించి, అందులో బన్నీ నటన గురించి చెప్పడానికి. అందుకే, అభిమానులంతా సెకండ్ పార్ట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మూవీ టీమ్ ఏమో ఒక్క విషయం కూడా బయటకు రానివ్వకుండా ఊరిస్తోంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దాని ప్రకారం వచ్చే ఏడాది అంటే 2024లో మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది ఆ న్యూస్ సారాంశం. ఆ వార్త విని ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఆ రోజున రిలీజ్ చేస్తే, వరసగా పండగలు ఉన్నాయి, సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం అని అనుకున్నారు. కానీ అది అఫిషీయల్ డేట్ కాదు. మూవీ టీమ్ ఇప్పటి వరకు ఆ డేట్ ని కన్ఫామ్ చేయలేదు.
దీంతో, ఫ్యాన్స్ డైలామాలో పడిపోయారు. తాజా వార్తల ప్రకారం మూవీ మార్చిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయట. ఎందుకంటే, ఈ మూవీ ఇప్పటి వరకు షూటింగ్ కనీసం 30శాతం కూడా పూర్తికాలేదట. అంటే, ఇంకా 70శాతం షూటింగ్ చేయాల్సి ఉంది. డైరెక్టర్ సుకుమార్ గురించి కూడా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత ఆలస్యం అయినా, పర్ఫెక్షన్ కి ఎక్కువ విలువ ఇస్తారు. ఈ లెక్కన ఇంకా ఈ మూవీ షూటింగ్ తీయాల్సింది చాలానే ఉంది. ఇవన్నీ చూస్తుంటే, మార్చికి పుష్ప చూడటం కష్టమే.
అయితే, ఆలస్యం అయినా కూడా, ఈ మూవీ విజువల్ ట్రీట్ లా ఉంటుందని తెలుస్తోంది. పుష్ప మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉంటుందట. ఇక, ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. మరి పుష్ప ఎప్పుడు వస్తాడో ఎదురు చూడటం తప్ప, మనం చేయగలిగింది ఏదీ లేదు.