Begin typing your search above and press return to search.

పుష్ప 2 డౌట్లేమి అక్కర్లేదు..!

సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఆర్య నుంచి అద్భుతాలు చేస్తూనే ఉన్నారు.

By:  Tupaki Desk   |   9 July 2024 1:30 PM GMT
పుష్ప 2 డౌట్లేమి అక్కర్లేదు..!
X

సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఆర్య నుంచి అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. డైరెక్టర్ హీరో హిట్ కాంబో రిపీట్ ఐతే ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంచనాలు ఏర్పరచుకుంటాయి. ఐతే ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా గురించి కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు దేశంలో ఉన్న ప్రతి సినీ అభిమాని ఎదురుచూస్తున్నాడు. పుష్ప 1 తో సంచలన విజయం అందుకున్న సుకుమార్ అల్లు అర్జున్ కాంబో ఆ సినిమా సీక్వెల్ కోసం రెండేళ్ల నుంచి తీస్తూనే ఉన్నారు.

ఈ సినిమాపై బీ టౌన్ ఆడియన్స్ లో ఉన్న అంచనాలను రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో సుకుమార్ చాలా జాగ్రత్తగా సినిమా చేస్తున్నాడట. పుష్ప 1 తో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్ పుష్ప 2 తో కూడా అంతకుమించిన హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఐతే పుష్ప 2 విషయంలో మొన్నటిదాకా సూపర్ బజ్ ఉంది. ఆగష్టు 15న రిలీజ్ చేయాలని నిర్మాతలు, హీరో ఎంత ప్రయత్నించినా డైరెక్టర్ సుకుమార్ మాత్రం నో అని చెప్పాడట. సినిమాను త్వరగా మడపెట్టేద్దాం అంటే కుదరదు ఆ ఎఫెక్ట్ రిజల్ట్ మీద పడుతుందని అన్నాడట. అప్పటి నుంచి పుష్ప 2 పై తెలియని ఇంపాక్ట్ పడింది.

ఆగష్టు 15 నుంచి డిసెంబర్ 6కి పుష్ప 2 పోస్ట్ పోన్ అయ్యింది. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని టాక్. ఐతే ఆడియన్స్ లో మాత్రం అసంతృప్తి కొనసాగుతుంది. పుష్ప 2 ఆగష్టులోనే వస్తుందని వాళ్లంతా ఎదురుచూశారు. కానీ సినిమా అప్పుడు కష్టమని డిసెంబర్ కి రిలీజ్ షిఫ్ట్ చేశారు. డిసెంబర్ కల్లా అయినా వస్తుందా రాదా అన్నది డౌట్ గానే ఉంది. సినిమా గురించి బయట ఎవరు ఏం అనుకున్నా సినిమాను మళ్లీ మరో సంచలనంగా మార్చేందుకు సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు కృషి చేస్తున్నారని తెలుస్తుంది.

ఎలాగోలా కాదు మళ్లీ కొడితే కుంభస్థలాన్ని టార్గెట్ చేయాలన్నది సుకుమార్ ఆలోచన. అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరు కలిసి కమిటెడ్ గా పనిచేస్తే వారి సినిమాల ఫలితాలు ఎలా వచ్చాయో తెలిసిందే. అదీగాక ప్రేక్షకులకు బాగా ఎక్కేసిన పుష్ప రాజ్ పాత్రలో మరోసారి అల్లు అర్జున్ విశ్వరూపం చూపించేందుకు సిద్ధపడుతున్నాడు. సో సినిమాపై వచ్చే వార్తలన్నిటినీ పట్టించుకోకుండా ఆడియన్స్ అంతా పుష్ప 2 అప్డేట్స్ కోసం వెయిట్ చేయడమే బెటర్ అని చెప్పొచ్చు.