పుష్ప 2.. ఇంకా ఎందుకు ఆగుతున్నారంటే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప ది రూల్ షూటింగ్ స్టేజ్ లో ఉంది.
By: Tupaki Desk | 17 Jun 2024 4:18 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోయే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప ది రూల్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని సుకుమార్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. పుష్పకి సీక్వెల్ గా సిద్ధమవుతోన్న చిత్రం కావడంతో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా పుష్ప ది రూల్ మూవీతో వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ ని అందుకోవాలని మైత్రీ మూవీ మేకర్స్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. పెర్ఫెక్షన్ కి మారుపేరైన సుకుమార్ పుష్ప ది రూల్ చిత్రాన్ని చాలా ప్లాన్డ్ గా చేస్తున్నారు. కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో అవుట్ ఫుట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. ఆగష్టు 15న ఈ మూవీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ డేట్ కి రిలీజ్ సాధ్యం కాకపోవచ్చనే మాట వినిపిస్తోంది. దీనికి కారణం పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఆగష్టు 15న ఎనౌన్స్ చేయడమే.
అయితే మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం రిలీజ్ డేట్ వాయిదాపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. దీనికి కారణం సుకుమార్ నుంచి స్పష్టత రాకపోవడమే అని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో 40 రోజుల్లో మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని సుకుమార్ టార్గెట్ గా పెట్టుకున్నారంట. దీనికోసం ఏకంగా మూడు యూనిట్స్ వర్క్ చేస్తున్నాయంట. మారేడుమల్లిలో కొన్ని కీలక సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారంట.
టీమ్ మొత్తం పూర్తి స్థాయిలో హార్డ్ వర్క్ చేస్తున్నారంట. విశ్రాంతి తీసుకోకుండా షూటింగ్ కంప్లీట్ చేయడంపైన దృష్టి పెట్టారంట. అనుకున్న టైం లోపు కంప్లీట్ అయితే ముందు ఫిక్స్ చేసినట్లుగానే ఆగష్టు 15కి రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. ఒక వేళ షూటింగ్ ఆలస్యం అయితే క్రిస్మస్ కి పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారంట.
ఎంత విశ్రాంతి లేకుండా పని షూటింగ్ చేసిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా సుకుమార్ ప్రత్యేక ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. క్వాలిటీ అవుట్ ఫుట్ అనుకున్నట్లు రావడానికి మరికొంత సమయం తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పుష్ప మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రిలీజ్ ముందు రోజు వరకు జరిగిందనే సంగతి అందరికి తెలిసిందే.