'పుష్ప-2' లో ఇంటిమేట్ సీన్సా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంకల్పించాలే గానీ సన్నివేశాల్లో సహజత్వాన్ని తట్టి లేపవడంలో ఆయనో స్పెషలిస్ట్
By: Tupaki Desk | 29 May 2024 11:40 AM GMTక్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంకల్పించాలే గానీ సన్నివేశాల్లో సహజత్వాన్ని తట్టి లేపవడంలో ఆయనో స్పెషలిస్ట్. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎంత మాత్రం వెనుకడుగు వేయని మేకర్ ఆయన. సుక్కు సినిమాల్లో రొమాన్స్ కి అంతే ప్రాధాన్యత ఇస్తారు. అంతే నేచురల్ గానూ చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయంలో సుకుమార్ రాజీ అనే మాట లేకుండా పని చేస్తారు. అందుకే '100పర్సంట్ లవ్' లో తమన్నాని అంత అందంగా..బోల్డ్ గా హైలైట్ చేయగలిగారు.
'కుమారి 21 ఎఫ్' లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న స్టోరీ రాయగలిగారు. ఇక పుష్ప-2 లో డబుల్ మీనింగ్ డైలాగులు... వ్యాన్ లో 'బన్నీ-రష్మిక ' మధ్య రొమాంటిక్ సీన్..నేనొచ్చి ముద్దిచ్చేదా...టవల్ చుట్టిన అనసూయని చూపించడం..డబుల్ మీనింగ్ డైలాగులు ఇలా ప్రతీ సన్నివేశం వెనుకు సుకుమార్ మార్క్ క్రియేటివిటీ ఉంది. తాజాగా పుష్ప-2 లో అంతకు మించి రొమాంటిక్ సన్నివేశాలు..ఇంటిమేట్స్ సీన్స్ తో తెరంతా మసాల సన్నివేశాలతో నిండిపోతుంది? అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది.
పుష్పరాజ్ -శ్రీవల్లి మెడలో మూడు ముళ్లు వేయడంతో శుభం కార్డు పడుతుంది. పుష్ప-2 లో కొనసాగింపు కథ అక్కడ నుంచే మొదలవుతుంది. అంటే పుష్పరాజ్ కి పెళ్లి అయింది కానీ శోభనం కాలేదు. సరిగ్గా ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. శోభనం గదిలో పుష్పరాజ్ రసిక రాజాలా ఆస్వాదిస్తుంటే? పోలీస్ స్టేషన్ లో అవమానంతో షెకావత్ ప్రతీకారానికి స్కెచ్ వేస్తుంటాడు. ఈ రెండు సన్నివేశాలు ఒకేసారి తెరపై హైలైట్ చేయనున్నారుట.
పుష్పరాజ్ ఫస్ట్ నైట్ సన్నివేశం విషయానికి వస్తే ఈ సీన్ ఎంతో వాస్తవికంగా ఉంటుందని లీకులందుతున్నాయి. పుష్ప రాజ్ వైపు శ్రీవల్లి చూసింది.. కారులోనే ముద్దు ముచ్చట తంతు పూర్తయింది. కానీ అసలు తంతు పూర్తి కాలేదు. దీనిలో భాగంగా పుష్ప- శ్రీవల్లి మధ్య ఘాటైన ఇంటిమేట్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటిని అంతే సహజంగా హైలైట్ చేయబోతున్నారని లీకులందుతున్నాయి. రొమాంటిక్ సన్నివేశాలకు ఇద్దరు అడ్డు చెప్పేవారు కాదు. రష్మిక ఈ విషయంలో ఎంతో పాజిటివ్ గా ఉంటుంది. బన్నీ సైతం సీన్ డిమాండ్ చేసిందంటే? తగ్గేదేలే! కాబట్టి పుష్ప-2 లో కుర్రాళ్లు మెచ్చే మసాలా కంటెంట్ ధారాళంగా ఉందని ఎక్స్ పెక్ట్ చేయోచ్చు.