Begin typing your search above and press return to search.

పుష్ప2 విషయంలో మళ్ళీ అదే పొరపాటు

పుష్ప రిలీజ్ సమయంలో కూడా సుకుమార్ కేవలం ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ భారం అంతా తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 4:24 AM GMT
పుష్ప2 విషయంలో మళ్ళీ అదే పొరపాటు
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పుష్పకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. పుష్పకి మించి బ్లాక్ బస్టర్ హిట్ ని ఈ చిత్రంతో సొంతం చేసుకోవాలని చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆగష్టు మొదటివారం వరకు ఈ మూవీ షూటింగ్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ విషయంలో సుకుమార్ పుష్ప తరహాలోనే వర్క్ చేస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది. సుకుమార్ మీద ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కంప్లైంట్ ఆలస్యంగా షూటింగ్ చేస్తారని. అలాగే రిలీజ్ ముందు రోజు వరకు ఆయన మూవీ అవుట్ ఫుట్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. పుష్ప 2 విషయంలో కూడా సుకుమార్ అదే రిపీట్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. రెండేళ్లుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. పెర్ఫెక్షన్ కి మారుపేరైన సుకుమార్ అవుట్ ఫుట్ విషయంలో అస్సలు రాజీపడరు.

తాను అనుకున్నట్లు వచ్చే వరకు షూటింగ్ చేస్తారు. ఇప్పుడు పుష్ప 2 కోసం కూడా అలాగే షూటింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఈ చిత్రం అయిన వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ పై దృష్టి పెడతారని అందరూ భావించారు. అయితే ఆగష్టు 1 వరకు ఇంకా షూటింగ్ జరగనుందంట. ఈ లెక్కన చూసుకుంటే ఈ సారి కూడా సుకుమార్ ప్రమోషన్స్ కి పెద్దగా అందుబాటులో ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

పుష్ప రిలీజ్ సమయంలో కూడా సుకుమార్ కేవలం ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ భారం అంతా తీసుకున్నారు. అలాగే ఈ సారి కూడా పుష్ప 2 ప్రమోషన్స్ బాధ్యత అంతా అల్లు అర్జున్ మీదనే వేసినట్లు ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. నిజానికి ఎప్పుడో మూవీ షూటింగ్ పూర్తయిపోతుందని అనుకున్నారు.

కానీ ఈ ఆలస్యానికి కారణం అయితే పూర్తిగా ఎవరికి తెలియదు. ఇదిలా ఉంటే ఇప్పటికే పుష్ప 2 నుంచి రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప రేంజ్ లోనే ఈ సీక్వెల్ లోని సాంగ్స్ ని రాక్ స్టార్ ఇచ్చాడనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సాంగ్స్ కి సంబందించిన హుక్ స్టెప్స్ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి.