Begin typing your search above and press return to search.

షాకింగ్ : ఆ టాక్ షో లో పుష్ప 2 స్టోరీ రివీల్‌...

అయితే ప్రేక్షకులు మాత్రమే కాకుండా పుష్ప 2 కోసం స్టార్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ రణబీర్‌ కపూర్ మాటలతో తేలిపోయింది.

By:  Tupaki Desk   |   24 Nov 2023 7:13 AM GMT
షాకింగ్ : ఆ టాక్ షో లో పుష్ప 2 స్టోరీ రివీల్‌...
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనే విషయం తెల్సిందే. అయితే ప్రేక్షకులు మాత్రమే కాకుండా పుష్ప 2 కోసం స్టార్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ రణబీర్‌ కపూర్ మాటలతో తేలిపోయింది.

తాజాగా రణబీర్ కపూర్‌ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో యానిమల్‌ సినిమా రూపొందింది. ఆ సినిమా వచ్చే వారం విడుదల అవుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ షో లో హీరో రణబీర్ కపూర్‌, హీరోయిన్ రష్మిక మందన్న మరియు దర్శకుడు సందీప్ వంగ సందడి చేశారు.

బాలయ్య అన్ స్టాపబుల్‌ యానిమల్‌ టీం ఎపిసోడ్‌ నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఎపిసోడ్‌ కి సంబంధించిన విషయాలు అప్పుడే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌ లో పుష్ప 2 సినిమా గురించి కొంత సమయం చర్చ జరిగింది. అదే ఇప్పుడు సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.

పుష్ప 2 లో రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. అందుకే యానిమల్‌ ప్రమోషనల్‌ టాక్‌ షో లో పుష్ప 2 గురించి చర్చ వచ్చింది. అప్పుడు రణబీర్‌ కపూర్ మాట్లాడుతూ.. చాలా సార్లు రష్మిక ను పుష్ప 2 కథ గురించి అడిగాము. కానీ ఆమె ఎప్పుడూ చెప్పలేదు. దాంతో నేను, సందీప్ షూటింగ్ గ్యాప్ లో పుష్ప 2 కథ గురించి చర్చించుకునే వాళ్ళం.

మాకు మేము కథ ను ఊహించుకునే వాళ్లం. పుష్ప 2 లో శ్రీవల్లి గర్భవతి అవ్వడం, బిడ్డ చనిపోవడం తో పుష్ప రివేంజ్ తీర్చుకుంటాడేమో అని నేను అంటే.. పుష్ప స్నేహితుడు కూడా చనిపోతాడేమో.. అతడి చావుకు పుష్ప రివేంజ్ తీర్చుకుంటాడేమో అంటూ సందీప్ అనేవాడు. అలా మేము పుష్ప 2 కథ గురించి మాట్లాడుకునే వాళ్లం అంటూ రణబీర్ కపూర్‌ రివీల్ చేశాడు.

ఇంతకు పుష్ప 2 కథ ఏంటి అనేది మాత్రం ఆ సుకుమార్‌ కి మాత్రమే తెలుసు. హీరో హీరోయిన్‌ కి కూడా పుష్ప 2 సినిమా యొక్క కథ పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు టార్గెట్‌ గా పుష్ప 2 రాబోతుంది.