Begin typing your search above and press return to search.

పుష్ప-2.. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?

ఇటీవలి కాలంలో 'పుష్ప 2' సినిమా చుట్టూ ఎన్నో రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి.

By:  Tupaki Desk   |   24 July 2024 3:27 AM GMT
పుష్ప-2.. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
X

ఇటీవలి కాలంలో 'పుష్ప 2' సినిమా చుట్టూ ఎన్నో రకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. హీరో అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, షూటింగ్ ఆగిపోయిందని, అందుకే బన్నీ గడ్డం తీసేసి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. వీటిపై రీసెంట్ గా జీఏ2 పిక్చర్స్ నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. అయినా సరే ఈ సినిమా చెప్పిన సమయానికి వస్తుందా రాదా? టైం సరిపోతుందా లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

బన్నీ వాస్ చెప్పిన దాని ప్రకారం 'పుష్ప 2: ది రూల్' చిత్రంలో అల్లు అర్జున్ కు సంబంధించి కేవలం 15-17 రోజుల వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. క్లైమాక్స్ సీన్, ఒక సాంగ్ షూట్ చేస్తే బన్నీ పోర్షన్ అంతా కంప్లీట్ అవుతుంది. ఫహాద్ ఫాజిల్ షూటింగ్ ఎక్కువ పెండింగ్ ఉంది. అయితే పర్ఫెక్ట్ ఔట్ పుట్ కోసం దర్శకుడు.. వర్క్ విషయంలో స్లో అండ్ స్టడీగా వెళ్తుంటారనే సంగతి తెలిసిందే. ఆయన వర్కింగ్ స్టయిల్ కారణంగానే మిగతా షూటింగ్ పూర్తి చేసి సెకండాఫ్ లాక్ చేయడానికి ఇంకెంత టైమ్ తీసుకుంటారో, రిలీజ్ డేట్ ను అందుకుంటారో లేదో అనే సందేహాలు వస్తున్నాయి.

కానీ సుక్కూ మాత్రం 'పుష్ప 2' విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6వ తేదీకి ఇంకా నాలుగున్నర సమయం ఉంది కాబట్టి.. ఓవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తూనే, మరోవైపు పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ముందుగా ఫస్ట్ హాఫ్ ను లాక్ చేసే పనిలో వున్నారు. అలానే ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఒక చిన్న షెడ్యూల్ షూటింగ్ పెట్టుకుంటున్నారు. మిగతా చిత్రీకరణ అంతా ఫినిష్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టాలని చూస్తున్నారు.

'పుష్ప 1' సౌండ్ మిక్సింగ్ విషయంలో జరిగిన పొరపాట్లు సెకండ్ పార్ట్ లో జరక్కుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. చివరి నిమిషంలో హడావిడిగా సినిమాని పంపించకుండా, ఈసారి ముందే అన్ని పనులు పూర్తి చేసుకునేలా ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. పోయిన సారి పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం ప్రధాన భారతీయ నగరాల్లో అల్లు అర్జున్ తన సినిమాని ప్రమోట్ చెయ్యాలని భావిస్తున్నారు. ఇదంతా జరగాలంటే సుకుమార్ పక్కా ప్లానింగ్ తో అన్నీ అనుకున్నట్లుగా పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.

'పుష్ప' మేకర్స్ మాత్రం వర్క్ విషయంలో, రిలీజ్ డేట్ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. సుకుమార్ టార్గెట్ ను రీచ్ అవుతాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన తేదీకి వస్తామని ధీమాగా ఉన్నారు. తగ్గేదే లే అంటూ తాజాగా విడుదల తేదీని మరోసారి స్పష్టం చేశారు. ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.