Begin typing your search above and press return to search.

పుష్ప 2: రెండో సాంగ్ ఆగయా.. అగ్గిరవ్వ లాంటి కెమిస్ట్రీ

"పుష్ప 2" సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు

By:  Tupaki Desk   |   29 May 2024 6:00 AM GMT
పుష్ప 2: రెండో సాంగ్ ఆగయా.. అగ్గిరవ్వ లాంటి కెమిస్ట్రీ
X

"పుష్ప 2" సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, "పుష్ప: ది రైజ్" ఘనవిజయం తరువాత మరింత అంచనాలను పెంచింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. "పుష్ప 2" టీమ్ ఇటీవల విడుదల చేసిన టైటిల్ సాంగ్ కు మంచి స్పందన లభించింది.

ఇక ఇప్పుడు మరో పాటను విడుదల చేశారు. "సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ" అనే ఈ సాంగ్ ప్రోమో తోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నా తమ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెగ్యులర్ గా కాకుండా కపుల్ సాంగ్ అంటూ బిహైండ్ ది సీన్స్ తరహాలో లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ప్రాక్టీస్ చేస్తూనే అల్లు అర్జున్ రొమాంటిక్ కెమిస్ట్రీతో ఆదరగొట్టేశారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట, పుష్పరాజ్ శ్రీవల్లి మధ్య ఉన్న కెమిస్ట్రీని మరింత హైలైట్ చేసింది. ఈ కొత్త కపుల్ సాంగ్ శ్రేయ ఘోషల్ గాత్రంలో సొంపుగా ఉంటుంది. ఈ పాటలో అల్లు అర్జున్ తన ఐకానిక్ స్టెప్పులతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మెలోడీ పాట రొమాంటిక్ గా ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. లిరికల్ వీడియోలో గణేష్ ఆచార్య మాస్టర్ కంపోజ్ చేస్తున్న విధానం సరదాగా సాగినట్లు అనిపిస్తుంది. ఇక సుకుమార్ తో కూడా మధ్యమధ్యలో స్టెప్పులు వేయించారు.

ఇటీవల విడుదలైన స్టిల్, జోడి లేటెస్టు ట్రెండ్ కు తగ్గట్లుగా ఉండడంతో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. "పుష్ప 2" లో మొత్తం 5 పాటలు ఉంటాయని తెలుస్తోంది. సుకుమార్ మరియు దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ ప్రతి సారి కూడా సక్సెస్ అయ్యింది. అల్లు అర్జున్ తో కలిసి వచ్చిన ప్రతి సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అందించారు, ఈ సారి కూడా అంతే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఈ చిత్రంలో ఒక ఐటెమ్ సాంగ్ కూడా ఉండనుంది. ఈ సాంగ్ కోసం పలు ప్రముఖ కథానాయికల పేర్లు పరిశీలిస్తున్నారు. జాన్వీ కపూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది, కానీ తుది నిర్ణయం ఇంకా రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమాత్రం రాజీ పడడం లేదు. "పుష్ప: ది రైజ్" విజయం తరువాత, "పుష్ప 2" పై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా ఆగస్టు 15న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సాధిస్తుందో చూడాలి.