Begin typing your search above and press return to search.

పుష్ప 2 : వైజాగ్ షూట్‌ ఆకస్మిక బ్రేక్ కారణం ఇదే!

వైజాగ్‌ షెడ్యూల్‌ ను రెండు రోజులు కూడా జరుపక పోవడం వెనుక కారణం ఏంటి అంటూ చాలా మందిలో ఉన్న ప్రశ్న.

By:  Tupaki Desk   |   13 March 2024 7:04 AM GMT
పుష్ప 2 : వైజాగ్ షూట్‌ ఆకస్మిక బ్రేక్ కారణం ఇదే!
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు సుకుమార్‌ భారీ బడ్జెట్‌ తో అద్భుతమైన కథ మరియు కథనంతో రూపొందిస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొదటి నుంచి కూడా అనుకున్నట్లుగా జరగడం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. అందుకే సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. రెండు రోజుల క్రితం వైజాగ్ లో షూటింగ్‌ కోసం పుష్ప యూనిట్‌ అంతా కూడా అక్కడకు వెళ్లిన విషయం తెల్సిందే.

అక్కడ ఫ్యాన్స్‌ అల్లు అర్జున్ కి పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేశారు. షూటింగ్‌ వారం నుంచి పది రోజుల పాటు జరుగుతుందని యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇంతలోనే బన్నీ హైదరాబాద్‌ రావడంతో పాటు యూనిట్‌ సభ్యులు అంతా కూడా హైదరాబాద్‌ లోని ఒక స్టూడియోలో షూటింగ్ మొదలు పెట్టారు.

వైజాగ్‌ షెడ్యూల్‌ ను రెండు రోజులు కూడా జరుపక పోవడం వెనుక కారణం ఏంటి అంటూ చాలా మందిలో ఉన్న ప్రశ్న. షూటింగ్‌ పూర్తి చేసుకుని పుష్ప 2 టీం వెళ్లారని కొంతమంది ప్రచారం చేస్తున్నా.. అసలు విషయం వేరే ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

బన్నీ కి స్వల్ప అనారోగ్యం సమస్యలు తలెత్తడం వల్లే వైజాగ్ షెడ్యూల్‌ ను ఆకస్మికంగా ఆపేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యుల నుంచి సరైన క్లారిటీ మాత్రం రాలేదు. వైజాగ్ షెడ్యూల్‌ ను మళ్లీ ఎప్పుడైనా పెట్టుకుని ప్రస్తుతం హైదరాబాద్‌ లో చేయాల్సిన సన్నివేశాలు చేస్తున్నారని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న పుష్ప 2 లో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ తో ఐటం సాంగ్‌ ను చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఆగస్టు 15న ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను సుకుమార్‌ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట.